OTT Telugu Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వస్తున్న రెండు తెలుగు సినిమాలు.. ఈ వారమే స్ట్రీమింగ్-ott telugu movies i hate love repati velugu to stream on etv win ott on thursday 21st november ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వస్తున్న రెండు తెలుగు సినిమాలు.. ఈ వారమే స్ట్రీమింగ్

OTT Telugu Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వస్తున్న రెండు తెలుగు సినిమాలు.. ఈ వారమే స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu
Nov 18, 2024 12:43 PM IST

OTT Telugu Movies: ఈ వారం ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి థియేటర్లలో రిలీజైన 9 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రూరల్ రొమాంటిక్ డ్రామా కావడం విశేషం.

ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వస్తున్న రెండు తెలుగు సినిమాలు.. ఈ వారమే స్ట్రీమింగ్
ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వస్తున్న రెండు తెలుగు సినిమాలు.. ఈ వారమే స్ట్రీమింగ్

OTT Telugu Movies: ఓటీటీల్లోకి ఈ వారం కూడా ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అయితే ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు వస్తుండటమే ఇక్కడ విశేషం. ఎన్నో లో బడ్జెట్ ఇంట్రెస్టింగ్ సినిమాలను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఓటీటీలోకే ఈ గురువారం (నవంబర్ 21) ఆ రెండు సినిమాలు వస్తున్నాయి.

ఐ హేట్ లవ్ ఓటీటీ రిలీజ్

ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తున్న మరో లో బడ్జెట్ మూవీ ఐ హేట్ లవ్. నేనూ ప్రేమలో పడ్డాను అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన సినిమా ఇది. ఈ మూవీ గురువారం (నవంబర్ 21) నుంచి స్ట్రీమింగ్ కానుంది. "ఐ హేట్ లవ్.. ఓ పల్లెటూరి ప్రేమకథ. కానీ ఈసారి అది తీపికథ కాదు. ప్రేమ, గౌరవం, ద్రోహం మధ్య నడిచే హృదయాన్ని తాకే గ్రామీణ కథ" అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఇదొక రూరల్ రొమాంటిక్ డ్రామా. రాంబాబు, సీత అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. అసలు ప్రేమ అంటేనే ఇష్టపడిన రాంబాబు.. ఓరోజు అనుకోకుండా సీత ప్రేమలో పడతాడు.

ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది.. చివరికి అదే అతని ప్రాణం ఎలా తీస్తుందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఐ హేట్ లవ్ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ కు కూడా చాలా కాలం పాటు నోచుకోలేకపోయింది. మొత్తానికి మరో మూడు రోజుల్లో ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

రేపటి వెలుగు ఓటీటీ రిలీజ్

ఇక ఈటీవీ విన్ లోకి ఇదే గురువారం (నవంబర్ 21) వస్తున్న మరో మూవీ రేపటి వెలుగు. ఇది నేరుగా డిజిటల్ ప్రీమియర్ కే సిద్ధమైన సినిమా. పెద్దగా పేరు లేని శత్రు, ప్రశాంత్ కార్తీ, విస్మయ శ్రీ, ఆద్విక్ బండారులాంటి వాళ్లు నటించిన సినిమా ఇది. రక్ష వీరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సమాజంలోని కొన్ని ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తూ సాగే ఎమోషనల్ డ్రామాగా కనిపిస్తోంది.

"రేపటి వెలుగు.. ఒక్క చీకటి రాత్రి, కొత్త వెలుగుకు నాంది. ఈ కథ ఆశకు, నమ్మకానికి, రేపటి ఆశయాలకు అంకితం" అనే క్యాప్షన్ తో రేపటి వెలుగు మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఈటీవీ విన్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. నిజానికి ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలంటూ గతంలోనే ఈటీవీ విన్ రివీల్ చేసిన సినిమాల జాబితాలో ఈ రేపటి వెలుగు కూడా ఒకటి.

Whats_app_banner