OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott telugu movie laggam to stream on aha video ott from 22nd november ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Nov 19, 2024 01:28 PM IST

OTT: ఓటీటీలోకి నెల రోజుల్లోపే మరో తెలుగు ఫ్యామిలీ డ్రామా రాబోతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో గత నెల 25న థియేటర్లలో రిలీజైన లగ్గం మూవీ మరో మూడు రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT: ఓ లోబడ్జెట్ తెలుగు మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తెలంగాణలో పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్ లాంటి సీనియర్ నటీనటులు నటించిన లగ్గం మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆహా వీడియో ఓటీటీ మంగళవారం (నవంబర్ 19) అధికారికంగా ప్రకటించింది. గత నెల 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

లగ్గం ఓటీటీ రిలీజ్ డేట్

లగ్గం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహా వీడియోలో నవంబర్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా సదరు ఓటీటీ వెల్లడించింది. "లగ్గం కుదిరింది. మేళం మోగనుంది.

అతి త్వరలో మీ ఆహాలో.. లగ్గం నవంబర్ 22న ఆహాలో ప్రీమియర్" అనే క్యాప్షన్ తో ఓ పోస్ట్ చేసింది. అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజైన లగ్గం మూవీ నెల రోజుల్లోపే ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్ లాంటి సీనియర్ నటులు ఇందులో నటించారు.

లగ్గం మూవీ స్టోరీ ఏంటంటే?

లగ్గం మూవీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఈ ప్రాంతంలో జరిగే పెళ్లి తంతును ఎంతో అందంగా చూపించిన మూవీ ఇది. ఈ మధ్య తెలంగాణ యాసలో వస్తున్న సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా.. లగ్గం కూడా ఆ జాబితాలో ఒకటి.

ఎన్ని అడ్డంకులు, సవాళ్లు, సమస్యలు ఎదురైనా.. వాటిని ఒక్కటిగా ఎదుర్కొనే కుటుంబం చుట్టూ తిరిగే కథే ఈ లగ్గం. పక్కా తెలంగాణ యాస, ఇక్కడి సాంప్రాదాయాలు, పెళ్లి తంతును ఆకట్టుకునేలా ఈ మూవీలో చూపించారు. లగ్గం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు రెండు మనసులు కలవడం అనే సందేశంతో తెరకెక్కిన సినిమా ఇది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అల్లుడిగా రావాలని కలలు కనే పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించాడు.

తన చెల్లి కొడుకునే తన కూతురికి భర్తగా తీసుకురావాలని అనుకునే అతడికి అనుకోని విధంగా పెళ్లి ఆగిపోవడంతో షాక్ తగులుతుంది. అసలు ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? తర్వాత ఏం జరిగింది. చివరికి వీళ్లు ఒక్కటవుతారా అన్నదే ఈ మూవీ కథ. రమేష్ చెప్పాలా సినిమాను డైరెక్ట్ చేయగా.. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్, రగు బాబు, చమ్మక్ చంద్రలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను బాగానే ప్రమోట్ చేసినా.. థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీ ద్వారా ఈ లగ్గం మూవీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Whats_app_banner