ఓటీటీల్లో తెలుగులో ఈవారం వచ్చిన నాలుగు సినిమాలు.. యాక్షన్ నుంచి కామెడీ వరకు..-ott telugu films released this week arjun son of vyjayanthi to maranamass amazon prime video sonyliv ott etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీల్లో తెలుగులో ఈవారం వచ్చిన నాలుగు సినిమాలు.. యాక్షన్ నుంచి కామెడీ వరకు..

ఓటీటీల్లో తెలుగులో ఈవారం వచ్చిన నాలుగు సినిమాలు.. యాక్షన్ నుంచి కామెడీ వరకు..

ఈవారం ఓటీటీల్లో తెలుగులో నాలుగు సినిమాలు ముఖ్యంగా వచ్చాయి. వివిధ జానర్లలో అడుగుపెట్టాయి. ఇందులో రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో వచ్చిన ఆ నాలుగు సినిమాలు ఏవంటే..

ఓటీటీల్లో తెలుగులో ఈవారం వచ్చిన నాలుగు సినిమాలు.. యాక్షన్ నుంచి కామెడీ వరకు..

ఓటీటీల్లో కొత్తగా తెలుగులో సినిమాలు చూడాలనుకునే వారికి.. ఈ వారం మరిన్ని నయా చిత్రాలు వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. తెలుగులో నాలుగు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. కల్యాణ్ రామ్ యాక్షన్ సినిమా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరో తెలుగు చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది. రెండు తెలుగు డబ్బింగ్‍‍లో అందుబాటులోకి వచ్చాయి. ఈవారం ఓటీటీలో తెలుగులో వచ్చిన నాలుగు సినిమాల వివరాలివే..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి

తెలుగు యాక్షన్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ శుక్రవారం మే 16వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించగా.. సీనియర్ నటి విజయశాంతి మరో ముఖ్యమైన పాత్ర చేశారు. యాక్షన్, తల్లీకొడుకుల సెంటిమెంట్‍తో సాగే ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసేయవచ్చు. ఈ మూవీలో సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, సోహెల్ ఖాన్, బబ్లూ పృథ్విరాజ్ కూడా కీలకపాత్రలు పోషించారు. అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చారు.

అనగనగా

అనగనగా సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఈ గురువారం ఏప్రిల్ 15వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా విద్యావ్యవస్థ, తండ్రీకొడుకుల ఎమోషనల్ బంధం చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సన్నీ సంజయ్ తెరకెక్కించారు. సుమంత్‍తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఈటీవీ విన్‍లో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన అనగనగా చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

మరణమాస్

మలయాళ డార్క్ కామెడీ సినిమా మరణమాస్ మే 14వ తేదీ సాయంత్రం సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఏప్రిల్ 10న థియేటర్లలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా హిట్ సాధించింది. బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మరణమాస్ మూవీకి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. రాజేశ్ మాధవన్, బాబు ఆంటోనీ, ,సిజు సన్నీ కీరోల్స్ చేశారు. కామెడీ, క్రైమ్, ట్విస్టులతో ఈ చిత్రం సాగుతుంది. సోనీ లివ్ ఓటీటీలో చూసేయండి.

గ్యాంగర్స్

తమిళ యాక్షన్ కామెడీ మూవీ గ్యాంగర్స్ ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమాలో సుందర్ సీ, వడివేలు, వాణి భోజన్, కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. నెలలోగానే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి గ్యాంగర్స్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం