OTT Telugu Crime Comedy Thriller: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Telugu Crime Comedy Thriller: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రావడం విశేషం. మూడున్నర నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.
OTT Telugu Crime Comedy Thriller: ఓటీటీలోకి మూడున్నర నెలల తర్వాత ఓ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా వచ్చింది. అయితే ఇప్పుడు కూడా ఆ మూవీ రెంట్ విధానంలోనే అందుబాటులోకి రావడం విశేషం. మే 17న థియేటర్లలో రిలీజైన నటరత్నాలు సినిమా.. ఓ మోస్తరు సక్సెస్ సాధించగా.. మంగళవారం (సెప్టెంబర్ 3) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.
నటరత్నాలు ఓటీటీలు రిలీజ్ డేట్
తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు నటరత్నాలు. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే ఈ మూవీ చూడాలంటే మాత్రం రూ.99 రెంట్ చెల్లించాల్సిందే.
సుమారు మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చినా.. ఇప్పటికీ సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రాకుండా కేవలం రెంట్ చెల్లించిన వాళ్లకే రావడం గమనార్హం. నటరత్నాలు మూవీ ఈ ఏడాది మే 17వ తేదీని థియేటర్లలో రిలీజైంది.
నటరత్నాలు మూవీ ఎలా ఉందంటే?
నర్ర శివనాగు డైరెక్ట్ చేసిన నటరత్నాలు మూవీలో బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్, అర్చనలాంటి వాళ్లు నటించారు. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో ఈ తరం నెహ్రూ అనే సినిమా చేసిన శివనాగు.. ఈసారి ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే నటరత్నాలు మూవీ.
ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వచ్చే యువత.. అక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నదే ఈ సినిమా కథ. ఒకరు హీరో, మరొకరు డైరెక్టర్, ఇంకొకరు కెమెరా మ్యాన్ అవ్వాలని కలగంటూ ముగ్గురు యువకులు పడే తపన చుట్టూ ఈ నటరత్నాలు కథ తిరుగుతుంది.
ఈ ముగ్గురికీ సినిమాలో అవకాశం వచ్చే సమయానికి ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అసలు వీళ్లకు, ఆ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? దాన్నుంచి వీళ్లు బయటపడతారా? వీళ్ల సినిమా కల నెరవేర్చుకుంటారా అన్నది నటరత్నాలు చూస్తే తెలుస్తుంది.
ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం రెంట్ విధానంలో ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సినిమా.. ఉచితంగా ఎప్పుడు వస్తుందన్నది ఇంకా వెల్లడించలేదు.