OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు కామెడీ మూవీ.. నాలుగు జంటల పెళ్లి, ఫస్ట్ నైట్ కష్టాలు చూస్తారా?
OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి మరో తెలుగు కామెడీ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. కథా కమామీషు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని సోమవారం (డిసెంబర్ 30) ఆహా వీడియో తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.
OTT Telugu Comedy Movie: ఆహా వీడియో ఓటీటీ వరుస ఒరిజినల్స్ తో దూసుకెళ్తోంది. ఈ మధ్యే ఆ ఓటీటీలో వేరే లెవెల్ ఆఫీస్ అనే వెబ్ సిరీస్ వచ్చి నవ్వులు పూయిస్తోంది. ఇక ఇప్పుడు మరో కామెడీ మూవీ కూడా నేరుగా ఇదే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు కథా కమామీషు. కొన్ని రోజుల కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా సోమవారం (డిసెంబర్ 30) ట్రైలర్ రిలీజ్ చేయడంతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేసింది.
కథా కమామీషు ఓటీటీ రిలీజ్ డేట్
ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వస్తున్న ఈ సినిమా పేరు కథా కమామీషు. ఈ మూవీ జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ కానుండటం విశేషం. గౌతమ్, కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ ఓ ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఇక పలాస, మట్కా లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమాలో ఓ ఫన్నీ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా నటించారు. వీళ్లే కాకుండా వెంకటేశ్ కాకుమాని, కార్తీక రాయ్, కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్లు కూడా నటించారు. చిన్న వాసుదేవ రెడ్డి ఐ డ్రీమ్ మీడియా, త్రీ విజిల్స్ టాకీస్ బ్యానర్లో మూవీ నిర్మించారు. ధృవన్ మ్యూజిక్ అందించాడు.
కథా కమామీషు ట్రైలర్ ఎలా ఉందంటే?
కథా కమామీషు మూవీ ట్రైలర్ చూస్తుంటే.. ఇది నాలుగు జంటలు, వాళ్ల పెళ్లి, ఫస్ట్ నైట్ కష్టాల చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం చాలా సరదాగా సాగిపోయింది. నిజానికి మూవీని మొదట థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు దొరకకపోవడంతో చివరికి ఓటీటీ రిలీజ్ కు సిద్ధమయ్యారు.
ఆహా వీడియో ఓటీటీ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. కొన్నాళ్ల కిందట కమింగ్ సూన్ అంటూ ఈ కథా కమామీషు మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇక ఇప్పుడు జనవరి 2 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. మరి న్యూ ఇయర్‌లో ఈ కామెడీ మూవీని చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.