OTT Telugu Comedy Movie: పది నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు అవార్డు విన్నింగ్ కామెడీ మూవీ
OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ అవార్డ్ విన్నింగ్ తెలుగు కామెడీ మూవీ వచ్చింది. నిజానికి గతేడాది రిలీజై నెల రోజుల్లోనే ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు రెండో ఓటీటీలోకి అడుగుపెట్టింది. కామెడీతోపాటు మంచి ఎమోషన్ పంచిన ఈ మూవీని మిస్ కావద్దు.
OTT Telugu Comedy Movie: ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఇప్పుడో తెలుగు సినిమా వచ్చింది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది నవంబర్ 11న థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత నెల రోజులకే ఆహా ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు పది నెలలకు మరో ఓటీటీలోనూ అడుగుపెట్టిన ఆ సినిమా పేరు దీపావళి.
దీపావళి ఓటీటీ స్ట్రీమింగ్
దీపావళి మూవీ తాజాగా ఈటీవీ విన్ ఓటీటీలోకి కూడా వచ్చింది. గురువారం (ఆగస్ట్ 29) నుంచి ఈ సినిమా తమ ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులను అందుకున్న ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఈ మూవీ స్ట్రీమింగ్ గురించి వెల్లడిస్తూ.. "ఈ సినిమా ఓ పండగ కాబోతోంది. పండగే ఈ సినిమా కానుంది. దీపావళి ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ ఉంచింది. కొన్ని రోజుల కిందట మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తూ దీపావళి స్ట్రీమింగ్ విషయాన్ని సదరు ఓటీటీ వెల్లడించింది.
దీపావళికి అవార్డులు
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ నిర్మించిన దీపావళి మూవీ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను అందుకుంది. రా వెంకట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది నవంబర్ 11న థియేటర్లలో రిలీజైంది. రియలిస్టిక్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన దీపావళి సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తమిళంలో కిడా పేరుతో రిలీజైన ఈ మూవీ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)లో ఇండియన్ పనోరమ విభాగంలో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. మెల్‌బోర్న్, జాగరణ్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకుంది. దీపావళి సినిమాలో రాము, కాళీ వెంకట్, దిలీప్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇదీ దీపావళి కథ
తాతామనవడి మధ్య అనుబంధం నేపథ్యంలో డైరెక్టర్ రా వెంకట్ దీపావళి మూవీని తెరకెక్కించాడు. ఆ మనవడు, అతనికెంతో ఇష్టమైన మేక, దానిని అమ్మడానికి చూసే తాతయ్య, మధ్యలో దొంగలు.. ఇలా నవ్విస్తూ సరదాగా సాగుతూనే భావోద్వేగానికి గురిచేసే సినిమా ఇది.
దీపావళి పండుగకు కొత్త బట్టలు కొనివ్వమని తాతయ్యను మనవడు అడుగుతాడు. మనవడి ఆశను తీర్చడం కోసం దేవుడికి మొక్కుబడి కోసం ఉంచిన మేకను తాతయ్య అమ్మడానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ మేకను కొత్తగా మటన్ షాప్ పెట్టిన వీరాస్వామి అనే వ్యక్తి కొన్నాడా? అన్నదే దీపావళి మూవీ కథ. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ దీపావళి సినిమాను నిర్మించాడు.
రూ.29కే ఈటీవీ విన్ సబ్‌స్క్రిప్షన్
ఈటీవీ విన్ ప్రముఖ తెలుగు ఓటీటీల్లో ఒకటి. అయితే ఈటీవీ 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఓటీటీ నెల రోజుల సబ్‌స్క్రిప్షన్ ను కేవలం రూ.29కే ఇస్తున్నారు. ఆగస్ట్ 27, 28, 29 తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఈటీవీ విన్ ఓటీటీ తెలిపింది. అంటే ఈరోజు (ఆగస్ట్ 29)తో ఆఫర్ ముగియనుంది.