ఓటీటీల హవా పెరిగిపోవడంతో విభిన్నమైన కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఇతర భాషల్లోనే కాదు తెలుగులో సైతం డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు, సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. వాటిలో హారర్, బోల్డ్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, కామెడీ వంటి వివిధ జోనర్స్ ఉంటున్నాయి.
అయితే, 2021లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ 3 రోజెస్. గ్లామర్ బ్యూటీలు పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన 3 రోజెస్ ఓటీటీలో బాగానే ఆకట్టుకుంది. రొమాంటిక్, కిస్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్‌తో 3 రోజెస్ అలరించింది. ఇప్పుడు నాలుగేళ్లకు 3 రోజెస్‌కు సీక్వెల్‌గా సీజన్ 2 రానుంది.
3 రోజెస్ సీజన్ 2 ప్రకటించినప్పటి నుంచి ఆసక్తి నెలకొంది. అయితే, మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌లో ప్రధాన పాత్రలు మారిపోయాయి. ఒక్క ఈషా రెబ్బా మాత్రం 3 రోజెస్ సీజన్ 2లో కంటిన్యూ కానుంది. దానికి సంబంధించిన ఈషా రెబ్బా గ్లింప్స్ ఇప్పటికీ విడుదలై బాగా ఆకట్టుకుంది. ఈషా రెబ్బా తర్వాత రెండో హీరోయిన్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపును పరిచయం చేశారు.
అయితే, 3 రోజెస్ సీజన్ 2లో కుషిత కల్లపు పాత్ర బోల్డ్‌గా ఉండనుందని గ్లింప్స్ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా 3 రోజెస్ సీజన్ 2లో మూడో హీరోయిన్‌ను ఎంట్రీని చూపించారు. మూడో గులాబీగా హీరోయిన్ రాశి సింగ్ 3 రోజెస్ సీజన్ 2లో కనిపించనుంది. 3 రోజెస్ 2 నుంచి రిలీజ్ చేసిన రాశి సింగ్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటోంది.
ముందు రాశి సింగ్‌ను అచ్చమైన తెలుగు అమ్మాలా, కట్టు బొట్టు, సాంప్రాదాయంగా ట్రెడిషనల్‌గా చూపించారు. ఆ తర్వాత పబ్‌లో షాట్స్ కొడుతూ, కరాటే పోజులిస్తూ గ్లామర్‌గా ప్రజంట్ చేశారు. 3 రోజెస్ సీజన్ 2లో కొత్త పాత్ర ఏంటీ అని చాట్ జీపీటీలో అడిగితే ట్రెడిషనల్‌గా ఉన్న రాశి సింగ్‌ను చూపించారు. ఆ తర్వాత గ్రోక్‌లో అడిగితే గ్లామర్‌గా ఉన్న రాశి సింగ్‌తో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.
అలా రెండు వేరియేషన్స్‌తో రాశి సింగ్ పాత్రను పరిచయం చేశారు. మరి రాశి సింగ్ పాత్ర ట్రెడిషనల్ నుంచి మోడరన్‌గా ఎందుకు మారింది అనేది గ్లింప్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. ఇకపోతే ట్రెడిషనల్ లుక్‌లో రాశి సింగ్‌ను చూపించినప్పటికీ బ్యాక్ సైడ్, నడుము చూపించే షాట్స్ మాత్రం బోల్డ్‌గా అట్రాక్ట్ చేస్తున్నాయి.
ఇప్పటికీ 3 రోజెస్ సీజన్ 2లో ఇద్దరు హీరోయిన్స్‌ను పరిచయం చేసిన మేకర్స్ తాజాగా మూడో హీరోయిన్‌గా రాశి సింగ్‌ను చూపించారు. ఇలా ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లోహర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్ కీలక పాత్రలతో త్రీ రోజెస్ సీజన్ 2ని తెరకెక్కించారు.
మొదటి సీజన్ లాగే ఆహాలో 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, 3 రోజెస్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ, 3 రోజెస్ సీజన్ 2ని మాత్రం ఆహా ఓటీటీలోనే వీక్షించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్