OTT Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే-ott tamil supernatural thriller yamakaathaghi now streaming on aha tamil know the story plot and cast details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే

OTT Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే

OTT Supernatural Horror: యమకాతగి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ అయింది. ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..

OTT Horror: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే

రూపా కడువాయుర్ ప్రధాన పాత్ర పోషించిన యమకాతగి చిత్రం మార్చి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రానికి పప్పిన్ జార్జ్ జయశీలన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నరేంద్ర ప్రసాద్ కూడా ఓ లీడ్ రోల్ చేశారు. ఈ యమకాతగి చిత్రం నేడు ఓటీటీలోకి వచ్చేసింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

యమకాతగి చిత్రం ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (ఏప్రిల్ 14) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తమిళ్‍లో స్ట్రీమ్ అవుతోంది.

తెలుగమ్మాయి కోలీవుడ్ ఎంట్రీ

తెలుగు హీరోయిన్ రూపా కొడువాయూర్.. యమకాతగి మూవీతోనే తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రాల్లో రూప నటించారు. ఆ తర్వాత యమకాగతితో కోలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. డిఫరెంట్ పాత్ర అయిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు రూప.

యమకాతగి మూవీని సూపర్ నేచురల్ చిత్రంగా తెరకెక్కించారు డైరెక్టర్ జయశీలన్. దర్శకుడిగా ఈ మూవీతోనే పరిచయమ్యారు. ఈ చిత్రానికి జెసిన్ జార్జ్ సంగీతం అందించారు. ఈ మూవీలో రూప, నరేంద్రతో పాటు గీతా కైలాసం, రాజు రాజప్పన్, సుభాష్ రామస్వామి, హరిత, ప్రదీప్ దురైరాజ్ కీలకపాత్ర పోషించారు.

నైసత్ మీడియా వర్క్స్, అరుణశ్రీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై శ్రీనివాసరావు జలకం, గణపతి రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రాన్ని ఇక ఆహా తమిళ్ ఓటీటీలో చూడొచ్చు.

యమకాతగి స్టోరీలైన్

తంజావురులోని ఓ గ్రామంలో తల్లిదండ్రులు, అన్నావదినలతో కలిసి ఉంటుంది లీల (రూప కడువాయూర్). చిన్నప్పటి నుంచే ఆస్తమాతో ఇబ్బంది పడే రూప ఎప్పుడు ఇన్‍హీలర్ వాడుతూ ఉంటుంది. ఓరోజు సడెన్‍గా ఉరేసుకొని చనిపోయిన పరిస్థితిలో లీల కనిపిస్తుంది. ఆమె అంత్యక్రియల కోసం కుటుంబం సిద్ధం చేస్తుంటుంది. కానీ ఇంట్లో నుంచి లీల శవాన్ని బయటికి తీసుకురాలేకపోతారు. లీల మరణం వెనుక మిస్టరీ ఏంటి? ఇంటికి వదిలివెళ్లేందుకు ఆ శవం ఎందుకు నిరాకరిస్తుంది? ఏ రహస్యాలు బయటికి వస్తాయి? చివరికి రూప శవాన్ని తీసుకెళ్లగలిగారా? అనేవి యమకాతగి సినిమాలో ఉంటాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం