‘లబ్బర్ పందు’ సినిమా ఓటీటీ రిలీజ్‍పై మంచి హైప్ ఉంది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ తమిళ చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ సినిమా దాదాపు రూ.5కోట్ల బడ్జెట్‍తో రూపొంది.. సుమారు రూ.40కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీలో హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్ లీడ్ రోల్స్ చేశారు.
తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం వహించిన ఈ లబ్బర్ పందు మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రానుంది. మొత్తంగా ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ వారం ఓటీటీ రిలీజ్‍ల్లో ఈ చిత్రాన్ని మంచి హైపే ఉంది.
లబ్బర్ పందు చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాల మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రేపు (అక్టోబర్ 31) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే ఈ అర్థరాత్రే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మరికొన్ని గంటల్లోనే లబ్బర్ పందు చిత్రాన్న హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
థియేటర్లలో తమిళంలో మాత్రమే రిలీజైన ఈ చిత్రం ఓటీటీలోకి ఐదు భాషల్లో వస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ హాట్‍స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ అవనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీలో ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. దీంతో ఐదు భాషల్లో ఈ మూవీ రేపటి నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుంది.
లబ్బర్ పందు మూవీ గల్లీ క్రికెట్‍లో జరిగే గొడవలు, ఓ లవ్ స్టోరీ చుట్టూ సాగుతుంది. లబ్బర్ పందు అంటే రబ్బర్ బంతి అనే అర్థం. గల్లీ క్రికెట్‍లో ఇద్దరి మధ్య ఈగోలతో గొడవలు జరుగుతుంటాయి. తగాదాలు పడే వ్యక్తి కూతురినే మరొకరు లవ్ చేస్తారు. ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‍తో ఈ మూవీ సాగుతుంది. స్పోర్ట్స్ డ్రామాతో పాటు ప్రేమ కథ మధ్య సంఘర్షణతో ఈ చిత్రం ఉంటుంది.
లబ్బర్ పందు మూవీలో హరీశ్ కల్యాణ్, దినేశ్‍తో పాటు సంజనా కృష్ణమూర్తి, స్వస్తిక, కాళీ వెంకట్, బాల శరవణన్, దేవ దర్శిని కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని గ్రిప్పింగ్ నరేషన్‍తో ఇంట్రెస్టింగ్‍గా, రస్టిక్‍గా తెరకెక్కించారు డైరెక్టర్ తమిళరాసన్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ కుమార్, వెంకటేశ్ నిర్మించారు. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.40కోట్లకు పైగా వసూళ్లతో లాభాలను దక్కించుకుంది. లబ్బర్ పందుకు సీన్ రోల్డన్ మ్యూజిక్ ఇచ్చారు.
తమిళ పీరియడ్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ అక్టోబర్ 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని బలమైన అంచనాలు ఉన్నాయి. విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ అర్ధరాత్రి ఓటీటీలోకి వస్తుందనే సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్‍పై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి ఈ చిత్రం సడెన్‍గా స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుందోమో చూడాలి. తంగలాన్ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించగా.. స్టూడియో గ్రీన్ నిర్మించింది. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది.