OTT Tamil Sports Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ స్పోర్ట్స్ డ్రామా.. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్-ott tamil sports drama labbar pandhu to stream on simply south for overseas audience from 18th october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Tamil Sports Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ స్పోర్ట్స్ డ్రామా.. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్

OTT Tamil Sports Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ స్పోర్ట్స్ డ్రామా.. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్

Hari Prasad S HT Telugu
Oct 16, 2024 08:35 AM IST

OTT Tamil Sports Drama: ఓటీటీలోకి మరో బ్లాక్ బస్టర్ తమిళ స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది. ఈ ఏడాది బెస్ట్ తమిళ సినిమాల్లో ఒకటిగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తున్న ఈ మూవీకి ఐఎండీబీలో తిరుగులేని రేటింగ్ ఉండటం విశేషం.

ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ స్పోర్ట్స్ డ్రామా.. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్
ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ స్పోర్ట్స్ డ్రామా.. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్

OTT Tamil Sports Drama: తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది అనుకోకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లబ్బర్ పండు (రబ్బరు బంతి). ఈ మూవీ సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.40 కోట్లకుపైగా వసూలు చేయగా.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

లబ్బర్ పండు ఓటీటీ రిలీజ్ డేట్

లబ్బర్ పండు ఓ తమిళ స్పోర్ట్స్ డ్రామా. హరీష్ కల్యాణ్, దినేష్ నటించిన ఈ సినిమాను తమిళరాసన్ పచ్చముత్తు డైరెక్ట్ చేశాడు. ఇది ఓ గ్రామంలోని ఇద్దరు క్రికెటర్ల చుట్టూ తిరిగే కథ.

సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అక్టోబర్ 18 నుంచి ఓటీటీలోకి రాబోతోంది. సింప్లీ సౌత్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతానికి కేవలం విదేశీ ప్రేక్షకులకు మాత్రమే మూవీ అందుబాటులోకి రానుంది. ఇండియాలో ఎప్పుడు వస్తుందన్నది త్వరలోనే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వెల్లడించనుంది.

ఈ లబ్బర్ పండు మూవీకి ఐఎండీబీలో ఏకంగా 8.9 రేటింగ్ ఉండటం విశేషం. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా కొనుగోలు చేసింది. త్వరలోనే మూవీ స్ట్రీమింగ్ తేదీని ఆ ఓటీటీ అనౌన్స్ చేయనుంది.

లబ్బర్ పండు మూవీ గురించి..

తమిళరాసన్ పచ్చముత్తు డైరెక్ట్ చేసిన తొలి మూవీయే అతనికి బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఇద్దరు గల్లీ క్రికెటర్ల ఈగో ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందన్నది ఈ మూవీలో చూపించారు. హరీష్ కల్యాణ్, దినేష్ లతోపాటు స్వాసికా, సంజనా కృష్ణమూర్తి కూడా ఇందులో నటించారు. ఈ లబ్బర్ పండు మూవీకి తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది.

మలయాళంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీలోని లీడ్ క్యారెక్టర్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ మూవీ తీసినట్లు డైరెక్టర్ తమిళరాసన్ చెప్పాడు. ఈ అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీ తెలుగులో భీమ్లా నాయక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ పాత్రల్లోని వ్యక్తుల ఈగోతోనే మూవీ నడుస్తుంది. లబ్బర్ పండు మూవీ స్టోరీ కూడా అలాంటిది. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Whats_app_banner