OTT Tamil Sci-Fi Action Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ-ott tamil science fiction action thriller movie kadaisi ulaga por to stream on amazon prime video on 18th october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Tamil Sci-fi Action Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Tamil Sci-Fi Action Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu

OTT Tamil Sci-Fi Action Thriller: ఓటీటీలోకి ఓ తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. హిప్‌హాప్ తమిళ ఆది నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు రెస్పాన్స్ సంపాదించింది.

ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Tamil Sci-Fi Action Thriller: ఓటీటీలోకి మరో తమిళ డిస్టోపియన్ వార్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ మూవీ పేరు కడైసీ ఉలగ పోర్ (Kadaisi Ulaga Por). హిప్‌హాప్ తమిళ ఆది కారణంగా ఈ మూవీ ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు కథ అందించడంతోపాటు డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరో.. ఇలా అన్నీ అతడే కావడం విశేషం.

కడైసీ ఉలగ పోర్ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయిన కడైసీ ఉలగ పోర్ మూవీ అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. హిప్‌హాప్ తమిళ ఆది లీడ్ రోల్ పోషించాడు.

కథ అందించి, డైరెక్ట్ చేసి, నిర్మించి, మ్యూజిక్ కూడా అతడే అందించిన సినిమా ఇది. సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో ఆదితోపాటు నాజర్, నట్టీ, అనగలాంటి వాళ్లు నటించారు. నెల రోజుల్లోపే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

కడైసీ ఉలగ పోర్ మూవీ కథ ఇదే

కడైసీ ఉలగ పోర్ మూవీ 2028లో జరిగినట్లుగా తీశారు. యునైటెడ్ నేషన్స్ ను రిపబ్లిక్ అనే మరో సంస్థతో భర్తీ చేయాలన్న చైనా సహా పలు ఇతర దేశాల ప్రతిపాదనను తోసిపుచ్చిన ఇండియాలాంటి దేశాలపై ఆంక్షలు విధించడం, మెల్లగా పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం.. ఈ నేపథ్యంలో కడైసీ ఉలగ పోర్ మూవీ స్టోరీ సాగుతుంది.

హిప్‌హాప్ తమిళ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద నిర్మించిన తొలి సినిమా ఇది. ఇక డైరెక్టర్ గా అతనికిది మూడో మూవీ. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన తర్వాత క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తమిళ సినిమాలో గతంలో ఎన్నడూ రాని డిస్టోపియన్ వార్ డ్రామాగా ఈ మూవీని పలువురు అభివర్ణించారు. రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశే ఎదురైంది.