OTT Survival Thriller: ఓటీటీలో పాపులర్ వెబ్ సిరీస్‍ రెండో సీజన్ స్ట్రీమింగ్ షూరూ.. తెలుగులోనూ.. ఎక్కడ చూడొచ్చంటే!-ott survival thriller the last of us season 2 streaming now on jiohotstar in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Survival Thriller: ఓటీటీలో పాపులర్ వెబ్ సిరీస్‍ రెండో సీజన్ స్ట్రీమింగ్ షూరూ.. తెలుగులోనూ.. ఎక్కడ చూడొచ్చంటే!

OTT Survival Thriller: ఓటీటీలో పాపులర్ వెబ్ సిరీస్‍ రెండో సీజన్ స్ట్రీమింగ్ షూరూ.. తెలుగులోనూ.. ఎక్కడ చూడొచ్చంటే!

The Last of Us Season 2 OTT Streaming: ది లాస్ట్ ఆఫ్ అజ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది. ఎంతో ఎదురుచూసిన సెకండ్ సీజన్ షురూ అయింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‍ను ఎక్కడ చూడాలంటే..

OTT Survival Thriller: ఓటీటీలో పాపులర్ వెబ్ సిరీస్‍ రెండో సీజన్ స్ట్రీమింగ్ షూరూ.. తెలుగులోనూ.. ఎక్కడ చూడొచ్చంటే!

‘ది లాస్ట్ ఆఫ్ అజ్’ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. రెండేళ్ల కిందట వచ్చిన ఈ అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ భారీ వ్యూస్ దక్కించుకుంది. పెడ్రో కాస్టెల్, బెల్లా రామ్సే ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఇండియాలోనూ ఫేమస్ అయింది. దీంతో రెండో సీజన్‍ కోసం చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ‘ది లాస్ట్ ఆఫ్ సీజన్ 2’ స్ట్రీమింగ్‍‍కు వచ్చేసింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 నేడు (ఏప్రిల్ 14) జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ రెండో సీజన్‍లో ఫస్ట్ ఎపిసోడ్ నేడు అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ప్రతీ వారం ఓ సీజన్

లాస్ట్ ఆఫ్ అజ్ రెండో సీజన్‍లో మొత్తంగా ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ నేడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇండియాలో ప్రతీ సోమవారం ఉదయం 6.30 గంటలకు ఈ రెండో సీజన్ కొత్త ఎపిసోడ్ రానుంది. మే 26వ తేదీన ఈ రెండో సీజన్‍లో చివరిదైన ఏదో ఎపిసోడ్ వస్తుంది. అప్పటి వరకు ప్రతీ సోమవారం కొత్త ఎపిసోడ్ ఎంట్రీ ఇస్తుంది.

లాస్ట్ ఆఫ్ అజ్ వెబ్ సిరీస్‍ను క్రెగ్ మాజిన్, నీల్ డ్రక్‍మ్యాన్ క్రియేట్ చేశారు. అదే పేరుతో ఉన్న గేమ్ ఆధారంగా ఈ థ్రిల్లర్ సిరీస్‍ను తెరకెక్కించారు. ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను థ్రిల్ పంచిన ఫస్ట్ సీజన్ పెద్ద సక్సెస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యూస్ సాధించింది. ఇప్పుడు రెండో సీజన్‍పై కూజా భారీ హైప్ ఉంది. ఈ సీజన్ కూడా దుమ్మురేపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

స్టోరీలైన్

ప్రమాదకరమైన ఫంగల్ ఇన్‍ఫెక్షన్‍కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఇమ్యూన్ ఉన్న అమ్మాయిని వేరే చోటికి తీసుకెళ్లే బాధ్యతను ఓ వ్యక్తి తీసుకోవడం, ఈ క్రమంలో చాలా సవాళ్లను ఎదుర్కోవడం చుట్టూ ది లాస్ట్ ఆఫ్ అజ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సాగింది. ఓ అంతుచిక్కని ఫంగస్ వ్యాపించి జనాలు జాంబీలుగా మారడంతో ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తుంది. ఈ వైరస్‍కు వ్యాక్సిన్‍ను తయారు చేసే ఇమ్యూన్ శక్తి ఎల్లీ (బెల్లా రామ్సే)లో ఉంటుంది. జోయల్ మిల్లర్ (పెడ్రో పాస్కల్).. ఎల్లీని ఫైర్‌ఫ్లైస్ కంటపడకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ఇద్దరి జర్నీ చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది. రెండో సీజన్‍లోనూ ఇదే కొనసాగనుంది.

ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2లో పెడ్రో కాస్టెల్, బెల్లా రామ్సేతో పాటు గాబ్రియెల్ లూనా, రుటినా వెస్లీ, కైట్లన్ దెవెర్, ఇసాబెలా మెర్సెడ్, యంగ్ మజినో కీలకపాత్రలు పోషించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం