OTT Survival Thriller Movie: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott survival thriller breakout ott release date etv win to stream from 9th january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Survival Thriller Movie: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Survival Thriller Movie: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

OTT Mystery Thriller Movie: ఓటీటీలోకి ఓ తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రెండేళ్ల తర్వాత స్ట్రీమింగ్ కు వస్తోంది. మార్చి 10, 2023లో రిలీజైన ఈ మూవీ.. సంక్రాంతి సందర్భంగా ఈటీవీ విన్ ఓటీటీలోకి రానుంది. తాజాగా ఆ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Mystery Thriller Movie: తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ బ్రేక్ఔట్ (Breakout) రెండేళ్ల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి రానుంది. జనవరి 9 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోమవారం (జనవరి 6) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ మధ్యే జనవరి మూవీస్ విషయాన్ని తెలిపిన ఆ ఓటీటీ.. తాజాగా స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేసింది.

బ్రేకౌట్ ఓటీటీ రిలీజ్ డేట్

రాజా గౌతమ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ బ్రేక్ఔట్. ఈ సినిమా మార్చి 10, 2023లో థియేటర్లలో రిలీజైంది. చాలా రోజులుగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురు చూసిన ప్రేక్షకులకు ఈటీవీ విన్ ఓటీటీ గుడ్ న్యూస్ చెప్పింది. "సర్వైవల్, కరేజ్ ఎక్సైటింగ్ స్టోరీ కోసం సిద్ధంగా ఉండండి. బ్రేక్ఔట్ జనవరి 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో తెలిపింది.

జనవరిలో తమ ప్లాట్‌ఫామ్ లోకి కొత్తగా నాలుగు తెలుగు సినిమాలు రాబోతున్నాయని గతంలోనే చెప్పిన ఈటీవీ విన్.. వాటిలో తొలి మూవీగా ఈ బ్రేక్ఔట్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలోకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

బ్రేక్ఔట్ మూవీ స్టోరీ ఇదే

బ్రేక్ఔట్ మూవీ డైరెక్టర్ కావాలని కలలు కలే మణిరత్నం (రాజా గౌతమ్) అనే యువకుడి చుట్టూ తిరిగే కథ. మోనోఫోబియాలో బాధపడే అంటే ఒంటరిగా ఉండటానికి భయపడే పాత్రలో అతడు నటించాడు. ఓ స్టోరీ నెరేషన్ కోసం హైదరాబాద్ వచ్చే అతడు.. అన్నింటికీ దూరంగా ఉండే ఓ గ్యారేజీలో ఆశ్రయం పొందుతాడు. రాజు అనే మెకానిక్ తన దగ్గర అతనికి షెల్టర్ ఇస్తాడు. అయితే అనుకోకుండా అందులో చిక్కుకుపోయే అతడు.. తన ఒంటరితనంతో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? అందులో నుంచి ఎలా బయటపడతాడన్నది ఈ బ్రేక్ఔట్ మూవీలో చూడొచ్చు.

ఈ సినిమా రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటించగా.. చిత్రం శ్రీను, కిరీటి దామరాజు, రమణ రాఘవ్, ఆనంద చక్రపాణిలాంటి వాళ్లు కూడా నటించారు. సుధాకర్ చెరుకూరి డైరెక్ట్ చేశాడు. అనిల్ మోదుగ మూవీని నిర్మించాడు. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో 6.8 రేటింగ్ నమోదైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు సుమారు రెండేళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.