OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన సూపర్ హిట్ తెలుగు మూవీ.. మరో రెండు రోజుల్లో మరో ఓటీటీలోకి కూడా..-ott sudheer babu maa nanna superhero ott release prime video streaming the movie zee5 to stream on 15th november ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన సూపర్ హిట్ తెలుగు మూవీ.. మరో రెండు రోజుల్లో మరో ఓటీటీలోకి కూడా..

OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన సూపర్ హిట్ తెలుగు మూవీ.. మరో రెండు రోజుల్లో మరో ఓటీటీలోకి కూడా..

Hari Prasad S HT Telugu

OTT: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు ఎమోషనల్ డ్రామా మా నాన్న సూపర్ హీరో వచ్చేసింది. సుధీర్ బాబు నటించిన ఈ మూవీ మరో రెండు రోజుల్లో జీ5 ఓటీటీలోకి వస్తుందని భావించినా.. అంతకుముందే మరో ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం.

ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన సూపర్ హిట్ తెలుగు మూవీ.. మరో రెండు రోజుల్లో మరో ఓటీటీలోకి కూడా..

OTT: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన ఎమోషనల్ డ్రామా మా నాన్న సూపర్ హీరో. గత నెల 11న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. నిజానికి ఈ మూవీ నవంబర్ 15 నుంచి జీ5 ఓటీటీలోకి వస్తుందని మొదట భావించినా.. బుధవారం (నవంబర్ 13) నుంచే మరో ఓటీటీలో ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచింది.

మా నాన్న సూపర్ హీరో ఓటీటీ స్ట్రీమింగ్

సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు శుక్రవారం (నవంబర్ 15) నుంచి జీ5 ఓటీటీలోకి కూడా అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ కొన్ని రోజుల కిందటే అనౌన్స్ చేసింది.

అయితే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ను మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోయారు. థియేటర్లలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశ పరిచింది. హరోం హర తర్వాత ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుధీర్ బాబుకు మళ్లీ నిరాశ తప్పలేదు.

మా నాన్న సూపర్ హీరో మూవీ గురించి..

మా నాన్న సూపర్ హీరో మూవీలో తండ్రీ కొడుకులుగా సాయాజీ షిండే, సుధీర్ బాబు నటించారు. అభిలాష డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ ఎమోషనల్ డ్రామాకు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. తండ్రీకొడుకుల అనుబంధంతో వచ్చిన మూవీ ఇది. అనాథగా మారిన తనను దత్తత తీసుకున్న తండ్రి.. తాను వచ్చిన తర్వాత అప్పుల పాలయ్యాయని అతన్ని ద్వేషిస్తుంటాడు.

కానీ అతడు మాత్రం తండ్రిని సూపర్ హీరోగా ప్రేమిస్తూ.. అతడు చేసిన అప్పులను తీరుస్తుంటాడు. అనుకోకుండా ఓ కేసులో జైలు పాలైన తండ్రిని ఆ కొడుకు విడిపించడానికి ఎలా ప్రయత్నాలు చేస్తాడు? ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు ఏంటన్నది ఈ మా నాన్న సూపర్ హీరో మూవీలో చూడొచ్చు. గతంలో తెలుగులో తండ్రీకొడుకుల ఎమోష‌న్‌తో స్టార్ హీరోలు సినిమాలు చేసి అద్భుత విజ‌యాల్ని అందుకున్నారు.

మా నాన్న సూప‌ర్ హీరో మూవీతో కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఈ జోన‌ర్‌ను ట‌చ్ చేశాడు హీరో సుధీర్ బాబు. దూర‌మైన త‌న కొడుకు ప్రేమ కోసం ప‌రిత‌పించే సొంత తండ్రి.. ద‌గ్గ‌రున్న కొడుకును అనుక్ష‌ణం ద్వేషించే ద‌త్త‌త తీసుకున్న‌ తండ్రి.. వారి మ‌ధ్య‌ ఓ కొడుకు జీవితం ఎలా సాగింద‌నే అంశాల‌తో ఎమోష‌న‌ల్ డ్రామాగా ద‌ర్శ‌కుడు మా నాన్న సూప‌ర్ హీరో మూవీని తెర‌కెక్కించాడు.

ఆర్థిక అవ‌స‌రాలు మ‌నిషిని ఎలా స్వార్థ‌ప‌రుడిగా మారుస్తాయ‌నే చిన్న సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు. తండ్రీకొడుకుల ఎమోష‌న్‌తో పాటు క్రైమ్, ల‌వ్ ఎలిమెంట్స్‌కు క‌థ‌లో ద‌ర్శ‌కుడు చోటిచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పూర్తిగా ఎమోషనల్ రోల్లో అతడు నటించిన తీరు మెప్పించింది. ఇప్పుడీ మా నాన్న సూపర్ హీరో మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.