OTT Romantic Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Romantic Thriller: నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పుడో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ దుమ్ము రేపుతోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే ట్రెండింగ్ మూవీస్ లో టాప్ లోకి దూసుకెళ్లడం విశేషం.
OTT Romantic Thriller: నెట్‌ఫ్లిక్స్ లో ఈ మధ్యే రిలీజైన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లింది. ఆదిపురుష్ లో సీతగా నటించిన కృతి సనన్ డ్యుయల్ రోల్లో కనిపించిన మూవీ ఇది. ఆమెతోపాటు సీనియర్ కాజోల్ కూడా నటించిన ఈ సినిమా పేరు దో పత్తి. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. థ్రిల్లర్ జానర్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచుతోంది.
దో పత్తి మూవీ టాప్ ట్రెండింగ్‌లోకి..
నెట్‌ఫ్లిక్స్ లో గత శుక్రవారం (అక్టోబర్ 25) స్ట్రీమింగ్ కు వచ్చిన మూవీ దో పత్తి (Do Patti). అంటే పేకాటలో కనిపించే రెండు కార్డులు. కృతి సనన్ డ్యుయల్ రోల్లో నటించిన సినిమా ఇది. ఈ కవలలు అందిస్తున్న థ్రిల్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందుకే నెట్‌ఫ్లిక్స్ లో మూడు రోజుల్లోనే ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది.
శశాంక్ చతుర్వేది డైరెక్ట్ చేసిన ఈ దో పత్తి మూవీ ఓ రొమాంటిక్ థ్రిల్లర్. గృహ హింస అనే కాన్సెప్ట్ ను తీసుకొని దానికి భిన్నమైన స్టోరీ లైన్ తో ప్రేక్షకులకు చెప్పిన విధానం బాగుంది. అందుకే ఈ సినిమాను ఓటీటీ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు.
దో పత్తి మూవీ ఎలా ఉందంటే?
దో పత్తి మూవీ సౌమ్య, శైలీ (కృతి సనన్ డ్యుయల్ రోల్) అనే ఇద్దరు కవలలు, విద్యా జ్యోతి కన్వర్ (కాజోల్) అనే ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్, ధృవ్ సూద్ (షహీర్ షేక్) అనే ఓ వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది.
ఒకేసారి పుట్టి.. జీవితాంతం ఒక్కటిగా కలిసి ఉండాల్సిన కవలలు.. ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారు.. వాళ్ల మధ్య శతృత్వం కథలో తీసుకొచ్చే ట్విస్టులు ఏంటి.. చివరికి ఆ ఇద్దరే కలిసి డొమెస్టిక్ వయోలెన్స్ ను ఎలా సమర్థంగా ఎదుర్కొంటారన్నది ఈ మూవీ స్టోరీ.
ఈ సినిమాలో కృతి సనన్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అమాయకమైన పాత్రతోపాటు డేరింగ్ అమ్మాయిగా రెండు భిన్నమైన పాత్రల్లో ఆమె నటన చాలా బాగుంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా కాజోల్ కూడా తన పాత్రలో జీవించేసింది. ఈ దో పత్తి మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ మూవీగా ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు కూడా హాయిగా చూసేయొచ్చు.