OTT Romantic Comedy: ఓటీటీలోకి వస్తున్న నయా రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. లవ్ స్టోరీలో అనుకోని ట్విస్ట్‌తో..
OTT Romantic Comedy: ప్యార్ టెస్టింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. వాలెంటైన్స్ డే రోజున స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో ఈ సిరీస్ వస్తోంది.
‘ప్యార్ టెస్టింగ్’ పేరుతో నయా వెబ్ సిరీస్ వస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్‍లో సత్యజీత్ దూబే, ప్రతిభ బోర్తాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. లవ్ స్టోరీ, కామెడీతో ఈ సిరీస్ ఉండనుంది. ఇద్దరి ప్రేమకథ ఓ అనుకోని మలుపు తిరుగుతుంది. ప్యార్ టెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ప్యార్ టెస్టింగ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 14వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్‍ను జీ5 తీసుకొస్తోంది. డేట్‍ను అధికారికంగా ప్రకటించింది.
ప్యార్ టెస్టింగ్ నుంచి ఫస్ట్ లుక్‍ను కూడా జీ5 రివీల్ చేసింది. సత్యజీత్, ప్రతిభ ట్రెడిషనల్ దుస్తుల్లో ఈ పోస్టర్‌లో ఉన్నారు. కుర్తా, సన్‍గ్లాసెస్‍ను సత్యజిత్ ధరించగా.. పింక్ కలర్ శారీ, ఆభరణాలు ధరించి మెరిశారు ప్రతిభ. బ్యాక్‍గ్రౌండ్‍లో రాజమహల్ లాంటిది కనిపిస్తోంది. రాయల్ ఫ్యామిలీ బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ సాగుతుంది.
ప్యార్ టెస్టింగ్‍లో ట్విస్ట్ ఇదే
ప్యార్ టెస్టింగ్ సిరీస్‍లో సత్యజిత్, ప్రతిభ లవ్ స్టోరీలో ఓ ట్విస్ట్ ఎదురవుతుంది. పెళ్లి కాకముందే సత్యజిత్ కుటుంబంతో కొన్ని రోజులు కలిసి ఉంటానని ఆ అమ్మాయి కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సిరీస్‍లో ఉండనుంది. లవ్, కామెడీ, డ్రామాతో ఈ సిరీస్ సాగుతుంది.
ప్యార్ టెస్టింగ్ వెబ్ సిరీస్‍ను జీ స్టూడియోస్ ప్రొడ్యూజ్ చేసింది. కామెడీ, డ్రామాతో ఉండే ఈ సిరీస్ ఫ్యామిలీ కలిసి చూసేందుకు పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్ సోహాలి కుమార్ అన్నారు. జైపూర్‌లో ఈ సిరీస్ షూటింగ్ జరిగిందని తెలిపారు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14 నుంచి జీ5లో ప్యార్ టెస్టింగ్ సిరీస్ చూడొచ్చు.
జీ5లో ఐడెంటిటీ
మలయాళ హీరో టివొనో థామస్, స్టార్ నటి త్రిష ప్రధాన పాత్రలు పోషించిన మూవీ ఐడెంటిటీ.. ఇటీవలే జనవరి 31వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 2న మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఐడెంటిటీ మూవీ నెలలోగానే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.
సంబంధిత కథనం