OTT Romantic Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న జయం రవి, నిత్య మేనన్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఆ రోజే-ott romantic comedy movie nithya menon starrer kadhalikka neramillai to stream on netflix from 11th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న జయం రవి, నిత్య మేనన్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఆ రోజే

OTT Romantic Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న జయం రవి, నిత్య మేనన్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఆ రోజే

Hari Prasad S HT Telugu
Published Feb 06, 2025 07:50 PM IST

OTT Romantic Comedy Movie: జయం రవి, నిత్య మేనన్ నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ కన్ఫమ్ అయింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనుంది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే వస్తోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫమ్.. తెలుగులో వస్తున్న జయం రవి, నిత్య మేనన్ తమిళ రొమాంటిక్ కామెడీ
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫమ్.. తెలుగులో వస్తున్న జయం రవి, నిత్య మేనన్ తమిళ రొమాంటిక్ కామెడీ

OTT Romantic Comedy Movie: తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ కాదలిక్క నేరమిళ్లై (Kadhalikka Neramillai) అనుకున్నదాని కంటే మూడు రోజుల ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. గురువారం (ఫిబ్రవరి 6) నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. నిత్య మేనన్, జయం రవి జంటగా నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఫర్వాలేదనిపించింది.

కాదలిక్క నేరమిళ్లై ఓటీటీ రిలీజ్ డేట్

కాదలిక్క నేరమిళ్లై అంటే ప్రేమించడానికి టైమ్ లేదు అని అర్థం. ఈ సినిమా జనవరి 14న పొంగల్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర రూ.16.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 6) తమ సోషల్ మీడియా ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది.

"ప్రేమించడానికి టైమ్ లేదా? విధి మాత్రం దానికి అంగీకరించడం లేదు. కాదలిక్క నేరమిళ్లై నెట్‌ఫ్లిక్స్ లోకి ఫిబ్రవరి 11న రాబోతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీల్లోనూ" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది. తెలుగులోనూ ఈ మూవీ వస్తుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

కాదలిక్క నేరమిళ్లై మూవీ కథేంటంటే?

ఈ కాదలిక్క నేరమిళ్లై మూవీ బాక్సాఫీస్ హిట్ అని చెప్పొచ్చు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.16.5 కోట్లు వచ్చాయి. జయం రవి, నిత్య మేనన్ జంటగా నటించిన మూవీ ఇది. ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ ఉదయనిధి డైరెక్ట్ చేసింది. థియేటర్లలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 2010లో వచ్చిన అమెరికన్ మూవీ ది స్విచ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

కాదలిక్క నేరమిళ్లై మూవీ స్టోరీ కాస్త భిన్నమైనదే. ఈ సినిమాలో శ్రేయ అనే పాత్రలో నిత్య, సిద్ధార్థ్ అనే పాత్ర రవి మోహన్ నటించారు. శ్రేయ ఓ ఆర్కిటెక్ట్. ఆమె కరణ్ అనే ఓ అబ్బాయిని ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుంది. అయితే అతని వల్ల పిల్లలు కలిగే అవకాశం లేకపోవడంతో విడాకులు ఇచ్చేసి ఐవీఎఫ్ ద్వారా తల్లి కావడానికి ప్రయత్నిస్తుంది.

ఆమె పీ.జేమ్స్ అనే మారుపేరు ద్వారా సిద్ధార్థ్ ఇచ్చిన వీర్యంతోనే తల్లి అవుతుంది. అయితే తనకు వీర్యదానం చేసిన అతని గురించి తెలుసుకోవడానికి శ్రేయ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అయితే మారుపేరు, తప్పుడు చిరునామా ఉండటంతో అతన్ని కనిపెట్టలేకపోతుంది. ఆలోపు ఆమె పార్థివ్ అనే బాబుకు జన్మనిస్తుంది. 8 ఏళ్ల తర్వాత చెన్నై వెళ్లిన సిద్ధార్థ్.. అనుకోకుండా శ్రేయ, పార్థివ్ లను కలుస్తాడు.

అతడికి తానే తండ్రి అనే విషయం సిద్ధార్థ్ కు తెలియకపోయినా ఆ ఇద్దరి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీ కథ. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన మూవీ కాదలిక్క నేరుమిళ్లై ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం