Romantic Comedy OTT: నేరుగా ఓటీటీకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ట్రైలర్ రిలీజ్
Romantic Comedy Movie OTT: ‘బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ’ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రైలర్ నేడు వచ్చింది. స్ట్రీమింగ్ డేట్ ఇప్పటికే ఖరారైంది.

వర్ధన్ పూరి, కావేరి కపూర్ హీరోహీరోయిన్లుగా బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ మూవీ వస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించారు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారడం, వారి మధ్య దూరం రావడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 8) రిలీజ్ అయింది.
ట్రైలర్ ఇలా..
కేమ్‍బ్రిడ్జ్ బ్యాక్‍డ్రాప్‍లో బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ మూవీ సాగుతుంది. చదువుకునేందుకు అక్కడికి వెళ్లిన బాబీ (కావేరి కపూర్), రిషి (వర్దన్ పూరి) ఒకరినొకరు ఇష్టపడతారు. ఇద్దరూ కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. ఆ తర్వాత లవ్‍లో పడతారు. ఇంతలో వారు దూరం కావాల్సి వస్తుంది. కేంబ్రిడ్జ్ నుంచి వారివారి ఊర్లకు వెళ్లిపోతారు. దూరమయ్యాక తాము ఏదో పోగొట్టుకున్నట్టు బాబీ, రిషి ఫీల్ అవుతారు. ఒకరిని ఒకరు కలవాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.. వీరు ఎలా కలిశారనే విషయాల చుట్టూ ఈ మూవీ సాగుతుందని ట్రైలర్‌తో అర్థమవుతోంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ చిత్రం ఫిబ్రవరి 11వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ హిందీ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తోంది. వాలెంటైన్ వీక్‍లో ఈ రొమాంటిక్ కామెడీ మూవీ హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తోంది.
బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ మూవీని సరదా సన్నివేశాలతో పాటు ఎమోషన్ ఉండే డ్రామాగా దర్శకుడు కునాల్ కోహ్లీ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‍పాండే, మోహన్ నాడార్ ప్రొడ్యూజ్ చేశారు. ఆశిష్ చబ్రా సంగీతం అందించారు.
కాగా, దేవకీ నందన వాసుదేవ చిత్రం నేడు (ఫిబ్రవరి 8) రాత్రి 8 గంటలకు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో ఇప్పటి వరకు ఓటీటీలో రాలేదు. అయితే, అంతకంటే ముందే హిందీలో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. దేవకీ నందన వాసుదేవ చిత్రం అశోక్ గల్లా హీరోగా నటించారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అశోక్ గల్లా సరసన మానస వారణాసి హీరోయిన్‍గా చేశారు. మైథలాజికల్ యాక్షన్ మూవీగా వచ్చిన దేవకీ నందన వాసుదేవ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది.
సంబంధిత కథనం