OTT Revenue: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?-ott revenue this is how netflix prime video hotstar ott platforms make money ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Revenue: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

OTT Revenue: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

Hari Prasad S HT Telugu
Dec 10, 2024 09:03 AM IST

OTT Revenue: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఆదాయం ఎలా? నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోట్లు పోసి సినిమాల డిజిటల్ హక్కులు, ఒరిజినల్ మూవీస్, సిరీస్ ఎలా నిర్మించగలుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చూడండి.

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

OTT Revenue: ఓటీటీ ఇప్పుడు మన జీవితాల్లో విడదీయలేని భాగం అయిపోయింది. టీవీ ఛానెల్స్ ను జనం దాదాపు మరచిపోయే పరిస్థితి. పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి వందల కోట్లు పెట్టి డిజిటల్ హక్కులను దక్కించుకొని నెల, రెండు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తోందీ ఓటీటీ. మరి కోట్లు ఖర్చు చేసే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్నది చాలా మందికి తెలియదు. అదెలాగో ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదాయం ఇలా..

ఓవర్ ద టాప్.. సింపుల్ గా ఓటీటీ.. శాటిలైట్ ఛానెల్స్ ను వెనక్కి నెట్టి ఇప్పుడు స్మార్ట్ టీవీ ఉన్న ప్రతి ఇంట్లోనూ తిష్ట వేస్తున్న ఈ ఓటీటీ స్పేస్ లోకి బడా కంపెనీలు వస్తూనే ఉన్నాయి. ఈ ఓటీటీ ఆదాయ మార్గాలు కూడా క్రమంగా పెరుగుతూనే ఉండటం కూడా బడా కంపెనీ దృష్టిని ఆకర్షిస్తోంది. వివిధ మార్గాల ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.

సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్

ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినా ఎంతోకొంత సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. నెట్‌ఫ్లిక్స్ లాంటి పేరున్న ఓటీటీని నెలకు కనీసం రూ.149 ప్లాన్ తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే అందులోని కంటెంట్ చూసే వీలుంటుంది. ఆ లెక్కన ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కైనా ప్రధాన ఆదాయ వనరు ఇదే అని చెప్పొచ్చు. ఎంతమంది సబ్‌స్క్రైబర్లు ఉంటే అంత ఆదాయం. అందుకే బడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోట్లు పోసి పెద్ద పెద్ద సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకొని ప్రేక్షకులను ఆకర్షిస్తాయి.

అడ్వర్టైజింగ్ ఆదాయం

సబ్‌స్క్రైబ్ చేసుకోలేని వారి కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాడ్ ఆధారిత ఆదాయం వైపు చూస్తున్నాయి. అంటే తక్కువ సబ్‌స్క్రిప్షన్ లేదంటే పూర్తి ఉచితంగా తమ కంటెంట్ అందిస్తూ మధ్యమధ్యలో యాడ్స్ ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. అలా యూజర్ల ద్వారా రావాల్సిన ఆదాయం వాణిజ్య ప్రకటనల ద్వారా వస్తుంది.

పే పర్ వ్యూ ఆదాయం

కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సినిమాలు లేదంటే స్పోర్ట్స్ కంటెంట్ ను అద్దె లేదా కొని చూసేందుకు వీలు కల్పిస్తాయి. కొన్ని పెద్ద సినిమాలను ఎర్లీ యాక్సెస్ పేరుతో ముందుగానే అందుబాటులోకి తీసుకొచ్చి సబ్‌స్క్రైబర్ల కోసం రెంట్ విధానంలో చూపిస్తుంటాయి. వీటి ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది.

లైసెన్సింగ్

ఇక ఇప్పుడు దాదాపు ప్రతి ఓటీటీ తమ ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మూవీస్, వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాయి. వీటిని ఇతర ప్లాట్‌ఫామ్స్ లేదా టీవీ నెట్‌వర్క్ లకు అమ్మడం ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి.

పార్ట్‌నర్‌షిప్స్, స్పాన్సర్‌షిప్స్

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పలు బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని తమ ప్లాట్‌ఫామ్స్ పై ప్రమోట్ చేయడం ద్వారా కూడా డబ్బు బాగానే సంపాదిస్తున్నాయి. ఇలా ఒక్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివిధ మార్గాల ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం క్రమంగా పెరుగుతూనే ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్ మొత్తం ఆదాయం 29500 కోట్ల డాలర్లకు చేరడం గమనార్హం. ఇది వచ్చే ఐదేళ్ల పాటు ఏటా 28 శాతం మేర వృద్ధి సాధించనున్నట్లు అంచనా వేస్తున్నారు.

Whats_app_banner