OTT Releases: ఈ వీకెండ్‌లో ఈ సినిమాలు, సిరీస్ మిస్ కావద్దు-ott releases you must watch this week end ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott Releases You Must Watch This Week End

OTT Releases: ఈ వీకెండ్‌లో ఈ సినిమాలు, సిరీస్ మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu
Jun 03, 2023 10:14 AM IST

OTT Releases: ఈ వీకెండ్‌లో ఈ సినిమాలు, సిరీస్ మిస్ కావద్దు. విజయ్ సేతుపతి నటించిన తొలి హిందీ మూవీ ముంబైకర్ నుంచి.. అసుర్ 2 సిరీస్ వరకూ ఈ వారం ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ ఎన్నో ఉన్నాయి.

విజయ్ సేతుపతి నటించిన ముంబైకర్
విజయ్ సేతుపతి నటించిన ముంబైకర్

OTT Releases: వీకెండ్‌లో హాయిగా ఇంట్లోనే కూర్చొని టైంపాస్ చేయాలనుకుంటే ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు బింజ్ వాచ్ చేసేయొచ్చు. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీలు ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి. ఆ మూవీస్, సిరీస్ ఏవో చూసేద్దాం.

ముంబైకర్.. విజయ్ సేతుపతి తొలి హిందీ మూవీ

జియో సినిమాలో ఈ మూవీ నేరుగా రిలీజైంది. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించిన తొలి హిందీ సినిమా ఇది. తమిళ మూవీ మానగారంను రీమేక్ చేసిన ముంబైకర్ గా తీశారు. ఓ పిల్లాడి కిడ్నాప్, దాని చుట్టూ నెలకొన్న గందరగోళం స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం (జూన్ 2) నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.

అసుర్ 2.. జియో సినిమాలో..

చాలా కాలంగా ఎదురు చూస్తున్న అసుర్ రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథతో ఎంతో ఆసక్తి రేపింది తొలి సీజన్. మొత్తానికి మూడేళ్ల తర్వాత రెండో సీజన్ జియో సినిమాలో వచ్చింది. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ నటించిన సిరీస్ ఇది.

స్కూల్ ఆఫ్ లైస్.. హాట్‌స్టార్ లో..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సిరీస్ పేరు స్కూల్ ఆఫ్ లైస్(School Of Lies). ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి మిస్ అయిపోయిన స్టూడెంట్ కథ ఇది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

స్కూప్ (Scoop).. నెట్‌ఫ్లిక్స్ లో..

స్కామ్ 1992లాంటి వెబ్ సిరీస్ అందించిన హన్సల్ మెహతా తీసిన మరో సిరీస్ స్కూప్. సాటి జర్నలిస్టును మర్డర్ చేసి జైల్లో ఉన్న ఓ క్రిమినల్ రిపోర్టర్ స్టోరీ ఇది. బిమైండ్ బార్స్ ఇన్ బైకులా: మై డేస్ ఇన్ ప్రిజన్ అనే పేరుతో జిగ్నా వోరా రాసిన బుక్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. కరిష్మా తన్నా, ప్రసేన్‌జిత్ ఛటర్జీ ఇందులో నటించారు.

తాజ్ 2(TAJ 2)

జీ5 (Zee5) ఓటీటీ తీసుకొచ్చిన మరో సిరీస్ తాజ్ 2. మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సింహాసనాన్ని అధీష్టించే వారసుడి కోసం సాగించే వేట నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. తాజ్ తొలి సీజన్ కు మంచి రివ్యూలు వచ్చాయి. తాజాగా రెండో సీజన్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. సలీమ్, అనార్కలి మధ్య జరిగిన ప్రేమను తొలి సీజన్ లో చూపించగా.. రెండో సీజన్ లో అనార్కలి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సలీమ్ ప్రయత్నించడం చూడొచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం