OTT releases this weekend: ఈ వీకెండ్ ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్, మూవీస్ ఇవే
OTT releases this weekend: ఈ వీకెండ్ మీకు టైంపాస్ చేయడానికి ఎప్పటిలాగే ఎన్నో వెబ్ సిరీస్, సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
OTT releases this weekend: ఓటీటీలు వచ్చిన తర్వాత వీకెండ్ లో ఏ థియేటర్ కు వెళ్లి ఏ సినిమా చూడాలో అన్న ఆలోచన చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంట్లోనే కూర్చొని రోజంతా బింజ్ వాచ్ చేసేలా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ ప్రతి వారం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ వారం కూడా అలాంటి డాక్యుసిరీస్, వెబ్ సిరీస్, సినిమాలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లోకి వచ్చేశాయి.
ఈ వీకెండ్ చూడాల్సిన సిరీస్, మూవీస్ ఇవే
ఈ వీకెండ్ లో చూడదగిన వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ, సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
ఈగల్ - ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్
మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లోల రిలీజ్ కాగా.. 20 రోజుల్లోనే రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. శుక్రవారం (మార్చి 1) ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీల్లోకి వచ్చిన ఈ సినిమాను వీకెండ్ లో చూసేయండి.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు - ఆహా ఓటీటీ
ఫిబ్రవరి 2న రిలీజైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ థియేటర్లలో విజయవంతమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. సుహాస్ నటించిన ఈ సినిమా మార్చి 1 నుంచి ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ లో మంచి టైంపాస్ అందించే సినిమా ఇది.
ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ - నెట్‌ఫ్లిక్స్
దేశాన్ని ఊపేసిన షీనా బోరా (2012) హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఐఎన్ఎక్స్ మీడియా మాజీ ఛీఫ్ ఇంద్రాణీ ముఖర్జీ చుట్టూ తిరిగి డాక్యు సిరీస్. దేశ చరిత్రలో ఎన్నో ట్విస్టులతో కూడిన ఈ హత్య కేసును నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ గా తీసుకొచ్చింది. శుక్రవారం (మార్చి 1) ఈ సిరీస్ రిలీజైంది.
మామ్లా లీగల్ హై - నెట్‌ఫ్లిక్స్
ప్రముఖ నటుడు రవికిషన్ నటించిన కోర్టు రూమ్ కామెడీ డ్రామా మామ్లా లీగల్ హై. ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ లో శుక్రవారం (మార్చి 1) నుంచి అందుబాటులోకి వచ్చింది.
సన్‌ఫ్లవర్ సీజన్ 1 వెబ్ సిరీస్ - జీ5 ఓటీటీ
కమెడియన్ సునీల్ గ్రోవర్ నటించిన ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేసింది. సన్‌ఫ్లవర్ సీజన్ 2 శుక్రవారం (మార్చి 1) నుంచి జీ5 ఓటీటీలోకి వచ్చింది. ఈ వీకెండ్ లో ఈ కామెడీ, మిస్టరీ సిరీస్ చూసేయండి.