OTT Releases this week: ఈ వారమే ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం మూవీ.. ఆ హారర్ వెబ్ సిరీస్ కూడా..-ott releases this week premalu ott release date inspector rishi lover patna shukla in netflix hotstar prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారమే ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం మూవీ.. ఆ హారర్ వెబ్ సిరీస్ కూడా..

OTT Releases this week: ఈ వారమే ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం మూవీ.. ఆ హారర్ వెబ్ సిరీస్ కూడా..

Hari Prasad S HT Telugu
Mar 25, 2024 09:04 AM IST

OTT Releases this week: ఈ వారం ఓటీటీల్లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అందులో సూపర్ డూపర్ హిట్ మలయాళం మూవీ ప్రేమలుతోపాటు ఓ హారర్ వెబ్ సిరీస్ కూడా ఉంది.

ఈ వారమే ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం మూవీ.. ఆ హారర్ వెబ్ సిరీస్ కూడా..
ఈ వారమే ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం మూవీ.. ఆ హారర్ వెబ్ సిరీస్ కూడా..

OTT Releases this week: వచ్చే లాంగ్ వీకెండ్ లో ఓటీటీ ప్రేక్షకులకు టైంపాస్ చేయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఇందులో సూపర్ హిట్ మలయాళం మూవీ ప్రేమలు కూడా ఉంది. ఇక ప్రైమ్ వీడియోలో ఇన్‌స్పెక్టర్ రిషి అనే కొత్త వెబ్ సిరీస్ కూడా వస్తోంది. శుక్రవారం (మార్చి 29) గుడ్ ఫ్రైడే హాలిడే కూడా ఉండటంతో ఈ లాంగ్ వీకెండ్ ఓటీటీల్లోని ఈ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ చూసేయండి.

yearly horoscope entry point

ప్రేమలు - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

మలయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ ప్రేమలు మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఆ తర్వాత తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు శుక్రవారం (మార్చి 29) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగుతోనూ ఈ రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది.

ఇన్‌స్పెక్టర్ రిషి -ప్రైమ్ వీడియో

నవీన్ చంద్ర నటించిన హారర్, క్రైమ్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఈ మధ్యే ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసిన తమ ఒరిజినల్స్ లో ఇదీ ఒకటి. శుక్రవారం (మార్చి 29) నుంచి ఈ కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. న‌వీన్ చంద్ర లీడ్ రోల్‌లో క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఇన్‌స్పెక్ట‌ర్ రిషి వెబ్ సిరీస్ త‌మిళంలో తెర‌కెక్కింది. ఈ వెబ్‌సిరీస్‌కు సుఖ్‌దేవ్ ల‌హిరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తమిళంతోపాటు తెలుగు, మరో ఇతర మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

లవర్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

తమిళ సూపర్ హిట్ మూవీ లవర్ కూడా మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా బుధవారం (మార్చి 27) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పట్నా శుక్లా - డిస్నీ పస్ల్ హాట్‌స్టార్

బాలీవుడ్ సీనియర్ రవీనా టండన్ నటించిన పట్నా శుక్లా మూవీ శుక్రవారం (మార్చి 29) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. బీహార్ లో జరిగిన ఓ ఎడ్యుకేషన్ స్కామ్ చుట్టూ తిరిగే కథతో మూవీ రాబోతోంది.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో - నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కొత్త షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే ఆదివారం (మార్చి 29) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్లు వస్తాయి.

లూటేరే - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

లూటేరే వెబ్ సిరీస్ గత శుక్రవారమే (మార్చి 22) హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. అయితే తొలి రెండు ఎపిసోడ్లను మాత్రమే ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. మూడో ఎపిసోడ్ గురువారం (మార్చి 28) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner