OTT Movies: ఓటీటీలో రెండ్రోజుల్లో 19 సినిమాలు- చూడాల్సినవి 9, తెలుగులో 6- బోల్డ్, హారర్, కామెడీ అన్ని జోనర్లలో!-ott releases this week on netflix amazon prime zee5 aha sony liv marco to let dhoom dhaam pottel ott movies streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో రెండ్రోజుల్లో 19 సినిమాలు- చూడాల్సినవి 9, తెలుగులో 6- బోల్డ్, హారర్, కామెడీ అన్ని జోనర్లలో!

OTT Movies: ఓటీటీలో రెండ్రోజుల్లో 19 సినిమాలు- చూడాల్సినవి 9, తెలుగులో 6- బోల్డ్, హారర్, కామెడీ అన్ని జోనర్లలో!

Sanjiv Kumar HT Telugu
Published Feb 15, 2025 11:04 AM IST

OTT Movies This Week Telugu: ఓటీటీలోకి గురు, శుక్ర రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో వీకెండ్‌కు చూసేలా 9 సినిమాలు స్పెషల్‌గా ఉంటే, అందులో 6 తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అవి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఆహా, జీ5లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

ఓటీటీ సినిమాలు
ఓటీటీ సినిమాలు

OTT Release Movies List In These 2 Days: ఓటీటీలోకి గురువారం (ఫిబ్రవరి 13), శుక్రవారం (ఫిబ్రవరి 14) రెండ్రోజుల్లో 19 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, యాక్షన్, కామెడీ థ్రిల్లర్, రొమాంటిక్ అండ్ బోల్డ్ జోనర్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా, సోనీ లివ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది ఎక్స్‌చేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్- ఫిబ్రవరి 13

కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 3 (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 13

లా డోల్సీ విల్లా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఫిబ్రవరి 13

ధూమ్ ధామ్ ( తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 14

మెలో మూవీ ( తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14

ఐయామ్ మ్యారీడ్.. బట్! (కొరియన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 14

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 14

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

లవ్ ఫర్ సేల్ (మలయాళ రొమాంటిక్ మూవీ)- ఫిబ్రవరి 13

టూ లెట్ (అవార్డ్ విన్నింగ్ తమిళ థ్రిల్లర్ కామెడీ చిత్రం)- ఫిబ్రవరి 13

మై ఫాల్ట్: లండన్ (బ్రిటీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 13

ఆహా ఓటీటీ

భైరతి రణగల్ (తెలుగు కన్నడ యాక్షన్ సినిమా)- ఫిబ్రవరి 13

డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ (తెలుగు రియాలిటీ డ్యాన్స్ షో)- ఫిబ్రవరి 14

బిషోహోరి (బెంగాలి సూపర్ నాచురల్ హారర్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఫిబ్రవరి 13

మార్కో (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 14

పొట్టేల్ (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- ఫిబ్రవరి 14

ప్యార్ కా ప్రొఫెసర్ (హిందీ రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్)- అమెజాన్, ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- ఫిబ్రవరి 14

మనోరాజ్యం (మలయాళ బోల్డ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 14

ప్యార్ టెస్టింగ్ (హిందీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 14

సబ్‌సర్వియన్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 14

రెండ్రోజుల్లో 19 ఓటీటీ సినిమాలు

ఇలా ఓటీటీలోకి గురు, శుక్ర రెండ్రోజుల్లో కలిపి 19 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో పొట్టేల్‌తోపాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు మార్కో, ధూమ్ ధామ్, భైరతి రణగల్, తెలుగు రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్, తెలుగు డబ్బింగ్ కొరియన్ సిరీస్ మెలో మూవీ స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, టూ లెట్, బిషోహోరి, మనోరాజ్యం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

స్పెషల్ 9- తెలుగులో 6

ఇలా 19లో మొత్తంగా చూసే బెస్ట్‌గా 7 సినిమాలు, ఒక రియాలిటీ షో, ఒకటి వెబ్ సిరీస్‌తో కలిపి 9 స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో ఆరు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవి వీకెండ్‌కు మంచి టైమ్ పాస్ అని చెప్పొచ్చు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం