OTT Releases This Week: హనుమాన్, సేవ్ ద టైగర్స్, భ్రమయుగం.. ఈవారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-ott releases this week hanuman save the tigers 2 murder mubarak bramayugam in netflix hotstar zee5 jio cinema sony liv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: హనుమాన్, సేవ్ ద టైగర్స్, భ్రమయుగం.. ఈవారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

OTT Releases This Week: హనుమాన్, సేవ్ ద టైగర్స్, భ్రమయుగం.. ఈవారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Published Mar 11, 2024 10:59 AM IST

OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో హనుమాన్ హిందీ వెర్షన్ తోపాటు సేవ్ ద టైగర్స్ సీజన్ 2 వెబ్ సిరీస్, భ్రమయుగంలాంటి సినిమాలు ఉన్నాయి.

హనుమాన్, సేవ్ ద టైగర్స్, భ్రమయుగం.. ఈవారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
హనుమాన్, సేవ్ ద టైగర్స్, భ్రమయుగం.. ఈవారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

OTT Releases This Week: ప్రతివారంలాగే ఈ వారం కూడా తెలుగు, హిందీ, మలయాళం భాషలకు చెందిన ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో సినిమా, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో ఈ సినిమాలు, సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

వీటిలో హనుమాన్, సేవ్ ద టైగర్స్ సీజన్ 2, మర్డర్ ముబారక్, భ్రమయుగం, మై అటల్ హులాంటి సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. ఏ సినిమా, సిరీస్ ఎందులో రానుందో చూద్దాం.

ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు

మార్చి 11 నుంచి మార్చి 17 మధ్య వివిధ ఓటీటీల్లోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

హనుమాన్ - జియో సినిమా

గతవారమే జీ5 ఓటీటీలోకి వస్తుందని ఆశించిన హనుమాన్ మూవీ.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఇప్పుడు హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం శనివారం (మార్చి 16) రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ తోపాటు జియో సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే హనుమాన్ తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ పై జీ5 ఓటీటీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

సేవ్ ద టైగర్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తొలి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రియదర్శి, అభినవ్ గోమటంలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ శుక్రవారం (మార్చి 15) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తొలి సీజన్ క్లైమ్యాక్స్ ఎంతో ఉత్కంఠ మధ్య ముగిసిన నేపథ్యంలో రెండో సీజన్ పై ఆసక్తి పెరిగింది.

భ్రమయుగం - సోనీలివ్

మలయాళంలో ఈ ఏడాది రిలీజై సంచలన విజయం సాధించిన హారర్ మూవీ భ్రమయుగం. మెగా స్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

లవర్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

తమిళంలో హిట్ అయిన లవర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మణికందన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతమైంది. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మర్డర్ ముబారక్ - నెట్‌ఫ్లిక్స్

మర్డర్ ముబారక్ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే రాబోతున్న ఓ హిందీ మూవీ. సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, పంకజ్ త్రిపాఠీలాంటి బాలీవుడ్ బడా హీరో,హీరోయిన్లు నటించిన ఈ సినిమా.. శుక్రవారం (మార్చి 15) నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వస్తుంది.

మై అటల్ హు - జీ5

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ బయోపిక్ అయిన మై అటల్ హు మూవీ జీ5 ఓటీటీలో గురువారం (మార్చి 14) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో వాజ్‌పేయీ పాత్రను పంకజ్ త్రిపాఠీ పోషించాడు.

Whats_app_banner