OTT Releases last week: గత వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన సినిమాలు ఇవే.. నేరు నుంచి యానిమల్ వరకు..-ott releases in january fourth week from animal neru to ssde side b and more latest movies streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases Last Week: గత వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన సినిమాలు ఇవే.. నేరు నుంచి యానిమల్ వరకు..

OTT Releases last week: గత వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన సినిమాలు ఇవే.. నేరు నుంచి యానిమల్ వరకు..

Recent OTT Releases: గత వారం ఓటీటీల్లోకి మరిన్ని సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. యానిమల్, నేరు సహా మరిన్ని చిత్రాలు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చాయి.

OTT Releases last week: గత వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమైన సినిమాలు ఇవే

గత వారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన యానిమల్ కూడా జనవరి నాలుగో వారంలోనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. సామ్ బహదూర్, నేరు సహా మరిన్ని చిత్రాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి. జనవరి నాలుగో వారం ఓటీటీల్లో అడుగుపెట్టిన ముఖ్యమైన సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

నేరు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ‘నేరు’ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 23వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. కోర్ట్ రూమ్ డ్రామాగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు.. హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు. నేరు సినిమాలో ప్రియమణి, అనాశ్వర రాజన్, శాంతి మహాదేవి, సిద్దిఖీ, జగదీశ్ కీలకపాత్రలు పోషించారు.

సప్తసాగరాలు దాటి సైడ్-బీ

సప్తసాగర దాచె ఎల్లో సైడ్- బీ (తెలుగులో సప్తసాగరాలు దాటి సైడ్-బీ) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో గత వారం సడెన్‍గా స్ట్రీమింగ్‍కు వచ్చింది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలో స్ట్రీమ్ అవుతోంది. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఎమోషనల్ లవ్ మూవీకి హేమంత్ ఎం రావ్ దర్శకత్వం వహించారు.

యానిమల్

బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ జనవరి 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించారు. థియేటర్లలో భారీ బ్లాక్‍బాస్టర్‌గా యానిమల్ నిలిచింది. ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి కీరోల్స్ చేశారు.

సామ్‍ బహదూర్

సామ్ బహదూర్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్‍ సామ్ మనెక్‍షా జీవితం ఆధారంగా ఈ బయోగ్రఫికల్ మూవీ వచ్చింది. సామ్ బహదూర్ చిత్రాన్ని డైరెక్టర్ మేఘనా గుల్జర్ తెరకెక్కించారు.

లిటిల్ మిస్ నైనా

లిటిల్ మిస్ నైనా మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగులో గత వారం స్ట్రీమింగ్‍కు వచ్చింది. లిటిల్ మిస్ రాథర్ మలయాళ మూవీని తెలుగు వెర్షన్‍లో లిటిల్ మిస్ నైనాగా ఈటీవీ విన్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో గౌరి జి కిషన్, షేర్షా షరీఫ్, జిష్ణు కుమార్, నందిని గోపాలకృష్ణ, మనోజ్, రంజిత్ వేలాయుధన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విష్ణు దేవ్ దర్శకత్వం వహించారు.

ఫైట్ క్లబ్

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నిర్మించిన ఫైట్ క్లబ్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో జనవరి 27వ తేదీన స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అబ్బాస్ ఏ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వినయ్ కుమార్, మొనిషా మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ఫైట్ క్లబ్ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.