OTT Releases : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలివే..-ott releases during this weekend telugu know here latest ott release movies here netflix hotstar zee5 jio cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott Releases During This Weekend Telugu Know Here Latest Ott Release Movies Here Netflix Hotstar Zee5 Jio Cinema

OTT Releases : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలివే..

Anand Sai HT Telugu
May 30, 2023 01:34 PM IST

OTT Releases : ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్. ఏ సినిమా అయినా.. ఓటీటీలో చూసేందుకే ప్రేక్షకుడు ఇష్టపడుతున్నాడు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ప్రతీ వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో చూద్దాం.

ఓటీటీ విడుదల
ఓటీటీ విడుదల

ప్రతి వారం లాగానే ఈ వారం కూడా డిజిటల్ కంటెంట్ నెటిజన్లను అలరించబోతోంది. సినిమాలు, వెబ్ ఫిల్మ్‌లు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు, ఆన్‌లైన్ విడుదలకు సిద్ధమవుతున్న చలనచిత్రాలు/ వెబ్ సిరీస్‌ల జాబితాలో ఏమేం ఉన్నాయో చూద్దాం.

జియో సినిమా:

1) అసుర సీజన్ 2: ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 1వ తేదీన డిజిటల్ ప్రీమియర్‌లకు షెడ్యూల్ చేయబడింది.

2) ముంబైకర్: ఈ బాలీవుడ్ చిత్రం జూన్ 2వ తేదీన డిజిటల్ ప్రీమియర్ షోలకు షెడ్యూల్ చేశారు.

3) గోదావరి : ఈ మరాఠీ చిత్రం జూన్ 3వ తేదీన డిజిటల్ ప్రీమియర్ షోలకు షెడ్యూల్ అయింది.

4) ఖిలాడీ: ఈ భోజ్‌పురి చిత్రం జూన్ 4న డిజిటల్ వేదికపై చూడొచ్చు.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

1) సులైకా మనీలా: ఈ మలయాళ చిత్రం మే 30వ తేదీన హాట్ స్టార్ లో చూడొచ్చు.

2) స్కూల్ ఆఫ్ లైస్: ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్ మే 30న అందుబాటులోకి వస్తుంది.

నెట్‌ఫ్లిక్స్:

1) ఫేక్ ప్రొఫైల్: ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ మే 31 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.

2) ఏ బ్యూటీఫుల్ లైఫ్ : ఈ హాలీవుడ్ సినిమా జూన్ 1వ తేదీన ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంటుంది.

3) న్యూ ఆమ్స్టర్డ్యామ్: ఈ హాలీవుడ్ సిరీస్ జూన్ 1వ తేదీ నుంచి డిజిటల్ వేదిక మీద చూడొచ్చు.

4) ఇన్ఫినిటి స్టోర్మ్ : ఈ హాలీవుడ్ చిత్రం జూన్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

5) మానిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2: ఈ హాలీవుడ్ సిరీస్ జూన్ 2వ తేదీ నుంచి మీరు చూడొచ్చు.

6) స్కూప్: ఈ బాలీవుడ్ సిరీస్ జూన్ 2వ తేదీన ఓటీటీలోకి వస్తుంది.

Zee5:

1) ఘర్ బందుక్ బిర్యానీ: ఈ మరాఠీ చిత్రం జూన్ 2వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.

2) హత్యపురి: ఈ బెంగాలీ చిత్రం జూన్ 2వ తేదీన ఓటీటీలో విడుదల అవుతుంది.

3) విశ్వక్: ఈ తెలుగు సినిమా జూన్ 2వ తేదీ నుంచి డిజిటల్ వేదిక మీద చూడొచ్చు.

బుక్‌మైషో:

1) ఈవిల్ డెడ్ రైజ్ : ఈ హాలీవుడ్ చిత్రం జూన్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం