ఓటీటీలో రెండ్రోజుల్లో 17 సినిమాలు- 10 చాలా స్పెషల్- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- వీకెండ్‌కు బెస్ట్- ఇక్కడ చూసేయండి!-ott release telugu movies these two days to watch on weekend anaganaga jolly o gymkhana maranamass ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో రెండ్రోజుల్లో 17 సినిమాలు- 10 చాలా స్పెషల్- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- వీకెండ్‌కు బెస్ట్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో రెండ్రోజుల్లో 17 సినిమాలు- 10 చాలా స్పెషల్- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- వీకెండ్‌కు బెస్ట్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి గత రెండు రోజుల్లో 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా పది ఉంటే.. తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఆరు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో రెండ్రోజుల్లో 17 సినిమాలు- 10 చాలా స్పెషల్- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- వీకెండ్‌కు బెస్ట్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి రెండు రోజుల్లో కలిపి 17 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్, కామెడీ, రొమాంటిక్, పొలిటికల్, హారర్ వంటి వివిధ జోనర్స్‌లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

థ్యాంక్యూ, నెక్ట్స్ సీజన్ 2 (టర్కీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 15

డియర్ హాంగ్‌రాంగ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16

ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16

రొట్టెన్ లెగసీ (స్పానిష్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్)- మే 16

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

భూల్ చుక్ మాఫ్ (హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 16

ఏ వర్కింగ్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 16

సన్ నెక్ట్స్ ఓటీటీ

నెసిప్పయ (తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ) -మే 16

అయ్యర్ ఇన్ అరేబియా (మలయాళ కామెడీ చిత్రం)- మే 16

మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ కామెడీ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- మే 15

అనగనగా (తెలుగు డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 15

జాలీ ఓ జింఖానా (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ సినిమా)- ఆహా ఓటీటీ- మే 15

హాయ్ జునూన్ (తెలుగు డబ్బింగ్ ఇండియన్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మే 16

మర్డర్‌బాట్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 16

మనమే (తమిళ డబ్బింగ్ తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- మే 16

పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ (మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 16

క.ము క.పి (తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- సింప్లీ సౌత్ ఓటీటీ- మే 16

కర్ఫ్యూ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 16

ఓటీటీలోకి 17

ఇలా గురువారం (మే 15), శుక్రవారం (మే 16) రెండు రోజుల్లో 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో భూల్ చుక్ మాఫ్, డియర్ హాంగ్‌రాంగ్, మరణమాస్, హాయ్ జునూన్, జాలీ ఓ జింఖానా, అనగనగా, నెసిప్పయ, అయ్యర్ ఇన్ అరేబియా, ఏ వర్కింగ్ మ్యాన్, పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

వీకెండ్‌కు బెస్ట్

పదిహేడింటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా పది సినిమాలు ఉంటే.. తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఆరు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలతో ఈ వీకెండ్‌ను బెస్ట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం