ఓటీటీలోకి ఇవాళ అతి తక్కువగా 7 సినిమాలు- 5 చాలా స్పెషల్, తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఈ 3 ఓటీటీల్లోనే స్ట్రీమింగ్-ott release movies today maine pyar kiya monster the ed gein story steve ott streaming netflix prime video apple plus tv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ అతి తక్కువగా 7 సినిమాలు- 5 చాలా స్పెషల్, తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఈ 3 ఓటీటీల్లోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి ఇవాళ అతి తక్కువగా 7 సినిమాలు- 5 చాలా స్పెషల్, తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఈ 3 ఓటీటీల్లోనే స్ట్రీమింగ్

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు కేవలం 7 సినిమాలు మాత్రమే డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 5 సినిమాలు ఉంటే అందులోనూ కేవలం 2 మూవీస్ మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ 3 ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ అతి తక్కువగా 7 సినిమాలు- 5 చాలా స్పెషల్, తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఈ 3 ఓటీటీల్లోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే కేవలం 7 సినిమాలు మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే, ప్రతి వారం సుమారుగా 30 నుంచి 40 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. వాటిలో ప్రతి శుక్రవారం అధిక సంఖ్యలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతుంటాయి.

ఒక్క శుక్రవారం మాత్రమే

వారానికి 30 నుంచి 40 వరకు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ అయితే వాటిలో ఒక్క శుక్రవారం మాత్రమే 15 నుంచి 20 లేదా అంతకు ఎక్కువగా చిత్రాలు ఓటీటీ ప్రీమియర్ అయ్యేవి. కానీ, ఈ శుక్రవారం అంటే ఇవాళ మాత్రం అతి తక్కువగా కేవలం 7 సినిమాలు మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

భిన్నంగా అతి తక్కువగా

ఇప్పటివరకు ఫ్రైడే ఓటీటీ రిలీజ్‌లో అధికంగా సినిమాలు ఉండేవి. కానీ, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా చాలా తక్కువగా మూవీస్ డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. ఇక ఈ 7 సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ వంటి మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మాన్‌స్టర్: ది ఎడ్‌ గీన్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 03

జీనీ, మేక్ ఏ విష్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మ్యాజికల్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 03

ది న్యూ ఫోర్స్ (స్వీడిష్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 03

స్టీవ్ (ఇంగ్లీష్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 03

ఓల్డ్ డాగ్, న్యూ ట్రిక్స్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 03

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మైనే ప్యార్ కియా (మలయాళం రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 03

ఆపిల్ ప్లస్ టీవీ

ది లాస్ట్ బస్ (అమెరికన్ సర్వైవల్ డ్రామా మూవీ)- అక్టోబర్ 03

చాలా స్పెషల్‌గా 5 మాత్రమే

ఇలా ఇవాళ (అక్టోబర్ 03) అతి తక్కువగా కేవలం 7 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో మాన్‌స్టర్: ది ఎడ్‌ గీన్ స్టోరీ, జీనీ-మేక్ ఏ విష్, స్టీవ్, మైనే ప్యార్ కియా, ది లాస్ట్ బస్‌తో కలిపి 5 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

తెలుగులో కేవలం రెండే

ఈ ఐదు సినిమాల్లో ఇంట్రెస్టింగ్‌గా తెలుగు భాషలో కేవలం 2 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇకపోతే మలయాళంలో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మైనే ప్యార్ కియా సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోతోపాటు లయన్స్ గేట్ ప్లే అనే మరో ఓటీటీలో కూడా మైనే ప్యార్ కియా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం