ఓటీటీలోకి 24 సినిమాలు.. 16 చాలా స్పెషల్.. తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!-ott release movies this week madharaasi junior the game little hearts ott streaming on etv win netflix aha amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి 24 సినిమాలు.. 16 చాలా స్పెషల్.. తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి 24 సినిమాలు.. 16 చాలా స్పెషల్.. తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే అందులో తెలుగు ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి 24 సినిమాలు.. 16 చాలా స్పెషల్.. తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 24 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సన్ నెక్ట్స్, ఆహా, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యేఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

  • మిస్సింగ్ కింగ్ (జపనీస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 29
  • నైట్‌మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ హారర్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 30
  • ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
  • వింక్స్ క్లబ్- ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
  • డూడ్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
  • మాన్‌స్టర్: ది ఎడ్‌ గీన్ స్టోరీ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 03
  • జీనీ, మేక్ ఏ విష్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ మ్యాజికల్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 03
  • ది న్యూ ఫోర్స్ (స్వీడిష్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 03
  • స్టీవ్ (ఇంగ్లీష్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 03
  • ఓల్డ్ డాగ్, న్యూ ట్రిక్స్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 03
  • రూరౌని కెన్షిన్ సీజన్ 2 (జపనీస్ అనైమ్ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 04

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

  • మదరాసి (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 01
  • ప్లే డర్టీ (అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 01
  • మైనే ప్యార్ కియా (మలయాళం రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 03

సన్ నెక్ట్స్ ఓటీటీ

  • సాహసం (మలయాళ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- అక్టోబర్ 01
  • గౌరీ శంకర (కన్నడ డ్రామా చిత్రం)- అక్టోబర్ 01
  • టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ హిస్టారికల్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02

జీ5 ఓటీటీ

  • చెక్ మేట్ (మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 02
  • డాకున్ డా ముందా 3 (పంజాబీ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం) - అక్టోబర్ 02

ఆపిల్ ప్లస్ టీవీ

  • ది సిస్టర్స్ గ్రిమ్ (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
  • ది లాస్ట్ బస్ (అమెరికన్ సర్వైవల్ డ్రామా మూవీ)- అక్టోబర్ 03
  • జూనియర్ (తెలుగు రొమాంటిక్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- సెప్టెంబర్ 30
  • లిటిల్ హార్ట్స్ (తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 01
  • 13th (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 01

ఓటీటీలోకి 24 సినిమాలు

ఇలా ఈ వారం (సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5) వరకు 24 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో జూనియర్, లిటిల్ హార్ట్స్, మదరాసి, చెక్ మేట్, సాహసం, ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్, మాన్‌స్టర్: ది ఎడ్‌ గీన్ స్టోరీ, స్టీవ్, జీనీ మేక్ ఏ విష్, గౌరీ శంకర సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు ది లాస్ట్ బస్, ది సిస్టర్స్ గ్రిమ్, 13th, డాకున్ డా ముందా 3, డాకున్ డా ముందా 3, మైనే ప్యార్ కియాతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉన్నాయి. ఇందులో కూడా తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం