ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో నాలుగు సినిమాలు స్పెషల్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రెండు తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అవనుండగా.. మరో రెండు ఒకే ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాలు ఏంటో, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హాలీవుడ్ ఫాంటసీ డార్క్ కామెడీ వెబ్ సిరీస్ సైరన్స్. మొల్లీ స్మిత్ మెట్జ్‌లర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్స్ ఫేమ్ మిల్లీ ఆల్కాక్, మేఘన్ ఫహీ, జులియన్ మూర్, హాలీవుడ్ పాపులర్ నటుడు కెవిన్ బాకొన్ కీలక పాత్రలు పోషించారు.
ఓ సిటీలో తప్పిపోయిన చెల్లికోసం వెతికే అక్క కథతో ఈ సిరీస్ సాగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 22 నుంచి సైరన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, మరికొన్ని గంటల్లో సైరన్స్ ఓటీటీ రిలీజ్ కానుంది.
షి ద పీపుల్ అనేది అమెరికన్ సిట్ కామ్ వెబ్ సిరీస్. టైలర్ పెర్రీ క్రియేట్ చేసిన షి ద పీపుల్ వెబ్ సిరీస్‌లో టెర్రీ చే వాఘన్, జేడ్ నోవా, జో మ్యారీ పైతాన్ ముఖ్య పాత్రలు పోషించారు. మే 22న నెట్‌ఫ్లిక్స్‌లో షి ద పీపుల్ ఓటీటీ రిలీజ్ కానుంది. మరికొన్ని గంటల్లో నెట్‌ఫ్లిక్స్‌లో షి ద పీపుల్, సైరన్స్ రెండు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
తమిళంలో తెరకెక్కిన మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ హార్ట్ బీట్. గతేడాది జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి హార్ట్ బీట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఏకంగా 8.4 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకుంది.
అలాంటి హార్ట్ బీట్ నుంచి రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ కానుంది. జియో హాట్‌స్టార్‌లో మరికొన్ని గంటల్లో (మే 22) హార్ట్ బీట్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు భాషలో కూడా హార్ట్ బీట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ పెండులమ్. డ్రీమ్స్‌లో ప్రపంచాన్ని సృష్టించుకోవడం, కలల్లో బతకడం, కలలో ఉన్నప్పుడు నత్తలు కనిపించడం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన పెండులమ్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 6.5 రేటింగ్ సాధించుకుంది.
రెజిన్ ఎస్ బాబు దర్శకత్వం వహించిన పెండులమ్ మూవీ మహేశ్ నారాయణన్ అనే డాక్టర్ చుట్టూ సాగుతుంది. రేపు (మే 22) ఓటీటీ రిలీజ్ అయ్యే నాలుగు సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్‌గా పెండులమ్ ఉండనుంది. ఈటీవీ విన్‌లో మరికొన్ని గంటల్లో పెండులమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు భాషలో పెండులమ్ ఓటీటీ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం
టాపిక్