OTT Telugu Release: ఓటీటీలోకి వచ్చిన 8 తెలుగు సినిమాలు.. ఫ్యామిలీతో చూసేందుకు 6 బెస్ట్.. ఎందుకంటే?-ott release movies telugu in 3 days razakar srikakulam sherlock holmes sivarapalli fear ott streaming on aha etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Release: ఓటీటీలోకి వచ్చిన 8 తెలుగు సినిమాలు.. ఫ్యామిలీతో చూసేందుకు 6 బెస్ట్.. ఎందుకంటే?

OTT Telugu Release: ఓటీటీలోకి వచ్చిన 8 తెలుగు సినిమాలు.. ఫ్యామిలీతో చూసేందుకు 6 బెస్ట్.. ఎందుకంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 25, 2025 08:55 AM IST

OTT Streaming Telugu Movies: ఓటీటీలోకి గత మూడు రోజుల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చాయి. కానీ, వాటిలో 6 తెలుగు స్ట్రైట్ సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాగా రెండు తెలుగు భాషలో డబ్ అయి రిలీజ్ అయ్యాయి. ఈ 8లో వీకెండ్‌కు ఫ్యామిలీతో చూసేందుకు 6 బెస్ట్ సినిమాలుగా ఉన్నాయి.

ఓటీటీలోకి వచ్చిన 8 తెలుగు సినిమాలు.. ఫ్యామిలీతో చూసేందుకు 6 బెస్ట్.. ఎందుకంటే?
ఓటీటీలోకి వచ్చిన 8 తెలుగు సినిమాలు.. ఫ్యామిలీతో చూసేందుకు 6 బెస్ట్.. ఎందుకంటే?

OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఈ వారం 14కి పైగా సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, గత మూడు రోజుల్లో అంటే బుధ (జనవరి 22), గురు (జనవరి 23), శుక్ర (జనవరి 24) వారాల్లో ఐదు తెలుగు స్ట్రైట్ సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటితోపాటు మరో రెండు తెలుగులో డబ్ అయ్యాయి. ఇలా మొత్తంగా మూడు రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన 8 తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లపై లుక్కేద్దాం.

yearly horoscope entry point

రజాకార్ ఓటీటీ

తెలంగాణలో రజాకార్‌లు ఆక్రమాలు, వారిపై తలెత్తిన పోరాటం, ఆపరేషన్ పోలో వంటి హిస్టారికల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన రజాకార్ మూవీ ఆహా ఓటీటీలో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, దీనికంటే రెండు రోజుల ముందే (జనవరి 22) ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు చూసేలా ఆఫర్ ఇచ్చింది ఆహా.

శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ ఓటీటీ

వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల నటించిన కామెడీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్. చంటబ్బాయ్ తాలుకా అనేది క్యాప్షన్. జనవరి 24 నుంచి ఈటీవీ విన్‌లో శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతో చూసి నవ్వుకోడానికి ఇది బెస్ట్ మూవీ.

సివరపల్లి ఓటీటీ

హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పంచాయత్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ సివరపల్లి. సోషల్ ఎలిమెంట్స్‌తో కామెడీ జోనర్‌లో తెరకెక్కిన సివరపల్లి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి 24 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా ఫ్యామిలీతో చూసేందుకు బెస్ట్ సిరీస్.

హిసాబ్ బరాబార్ ఓటీటీ

మాధవన్ మెయిన్ లీడ్ రోల్‌లో టికెట్ కలెక్టర్‌గా నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా హిసాబ్ బరాబర్. బ్యాంక్‌లో జరిగే స్కామ్స్ నేపథ్యంలో సాగే హిసాబ్ బరాబర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో రిలీజ్ అయింది. జనవరి 24 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌ను ఫ్యామిలీతో చూసేయొచ్చు.

హైడ్ అండ్ సీక్ ఓటీటీ

ఇది వరకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్ తాజాగా మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సన్ ఎన్‌ఎక్స్‌టీలో రిలీజ్ అయింది. జనవరి 24 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో హైడ్ అండ్ సీక్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. దీన్ని కూడా ఫ్యామిలీతో చూసి ఆస్వాదించొచ్చు.

వైఫ్ ఆఫ్ ఓటీటీ

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు రివేంజ్, లవ్, ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ వైఫ్ ఆఫ్. కేవలం 80 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 23 నుంచి ప్రదర్శితం అవుతోంది.

బరోజ్ 3డీ ఓటీటీ

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నిధిని కాపాడే జీనీగా నటించిన మాలీవుడ్ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా బరోజ్ త్రీడి. జనవరి 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న బరోజ్‌ను కుటుంబం, పిల్లలతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.

ఫియర్ ఓటీటీ

బ్యూటిఫుల్ వేదిక డ్యుయల్ రోల్‌లో నటించిన తెలుగు సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఫియర్ అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 22 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను కూడా కూడా ఫ్యామిలీతో వీక్షించొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం