OTT Movies: రెండ్రోజుల్లో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 8 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?-ott release movies in telugu on netflix amazon prime etv win rahasyam idham jagath never let go squid game 2 streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: రెండ్రోజుల్లో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 8 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?

OTT Movies: రెండ్రోజుల్లో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 8 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 28, 2024 09:14 AM IST

OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఈ వారంలో 26కిపైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో రెండ్రోజుల్లో 8 మూవీస్ తెలుగు భాషలో రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు తప్పా మిగతావన్నీ డబ్బింగ్ మూవీస్. ఇక వీటన్నింటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలుగా ఐదు ఉన్నాయి.

రెండ్రోజుల్లో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 8 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?
రెండ్రోజుల్లో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 8 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?

OTT Movies Telugu Latest: ఈ వారం ఓటీటీలోకి దాదాపుగా 26కిపైగా సినిమాలు రిలీజ్ అయి సందడి చేశాయి. వాటిలో గురువారం (డిసెంబర్ 26), శుక్రవారం (డిసెంబర్ 27) ఈ రెండు రోజుల్లో 20 వరకు మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి . అయితే, వీటిలో 8 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో హారర్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, సర్వైవల్ థ్రిల్లర్ ఇతర జోనర్స్ ఉన్నాయి.

yearly horoscope entry point

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 26

ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ (తెలుగు డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబర్ 27

సొర్గవాసల్ (తెలుగు డబ్బింగ్ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 27

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మై ప్రిన్సెస్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 26

నెవర్ లెట్ గో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 26

యువర్ ఫాల్ట్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ రొమాంటిక్ డ్రామా సినిమా)- డిసెంబర్ 27

రహస్యం ఇదం జగత్ ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 26 తెలుగు

డాక్టర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- డిసెంబర్ 27

ఇలా రెండ్రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 8 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో కచ్చితంగా చూడాల్సిన చిత్రాలుగా 5 ఉన్నాయి. అవేంటో, ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

  1. స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఓటీటీ

2021 సెప్టెంబర్‌లో డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన కొరియన్ సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 1 సూపర్ హిట్ అయింది. ఈ సిరీస్, అందులో గేమ్ తెగ ట్రెండ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ వెబ్ సిరీస్‌ రెండో సీజన్‌పై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో 2024 డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి కొరియన్‌తోపాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో వచ్చిన స్క్విడ్ గేమ్ 2 చాలా స్పెషల్.

2. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీ

ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న రాజమౌళి ఎంతటి రికార్డ్స్ క్రియేట్ చేశాడో తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతీని తీసుకెళ్లిన మూవీ రౌద్రం రణం రుధిరం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మేకింగ్, బిహైండ్ సీన్స్ వివరిస్తూ తెరకెక్కించిన డాక్యుమెంటరీ మూవీ ఇది. కాట్టి ఇది కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు.

3. సొర్గవాసల్ ఓటీటీ

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి తమిళ మూవీ సోర్గవాసల్ మంచి ఛాయిస్. నవంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జైళ్లోని ఓ ఖైదీ చుట్టూ తిరుగుతుంది. ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ సాధించుకున్న సోర్గవాసల్ నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతోపాటు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది

4. నెవర్ లెట్ గో ఓటీటీ

హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు పిల్లలతో ఓ తల్లి చేసే సర్వైవల్ జర్నీనే నెవర్ లెట్ గో మూవీ. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నెవర్ లెట్ గో మూవీ ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

5. రహస్యం ఇదం జగత్ ఓటీటీ

తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ రహస్యం ఇదం జగత్. అమెరికాలో శ్రీ చక్రంపై జరిగిన పరిశోధన నుంచి స్ఫూర్తిగా తీసుకుని టైమ్ ట్రావెల్, వామ్ హోల్, హిందూ పురాణాలు, ఇతి హాసాలను జోడించి చిత్రీకరించిన ఈ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 26 నుంచి ఈటీవీ విన్‌లో రహస్యం ఇదం జగత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner