OTT Raksha Bandhan Movies: ఓటీటీల్లో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో ఉన్న తెలుగు సినిమాలు ఇవే.. అన్నీ స్టార్ హీరోలవే..-ott raksha bandhan movies ott telugu movies on brother sister sentiment prime video netflix zee5 youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Raksha Bandhan Movies: ఓటీటీల్లో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో ఉన్న తెలుగు సినిమాలు ఇవే.. అన్నీ స్టార్ హీరోలవే..

OTT Raksha Bandhan Movies: ఓటీటీల్లో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో ఉన్న తెలుగు సినిమాలు ఇవే.. అన్నీ స్టార్ హీరోలవే..

Hari Prasad S HT Telugu

OTT Raksha Bandhan Movies: రాఖీ పండుగనాడు ఓటీటీల్లో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు కలిసి చూసేందుకు తెలుగులో చాలా సినిమాలే ఉన్నాయి. పవన్ కల్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాలు రక్షా బంధన్ రోజు చూడదగినవే.

ఓటీటీల్లో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో ఉన్న తెలుగు సినిమాలు ఇవే.. అన్నీ స్టార్ హీరోలవే..

OTT Raksha Bandhan Movies: ఓటీటీల్లో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. సోమవారం (ఆగస్ట్ 19) ఈ పండుగ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమాలే ఇవి. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఈ సెంటిమెంటుతో వచ్చిన సినిమాల్లో నటించారు. అటు హిందీలోనూ చూడాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి.

రాఖీ పండుగ రోజు చూడాల్సిన సినిమాలు

తెలుగులో అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల సెంటిమెంటుతో వచ్చిన సినిమాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు నటించారు. మరి ఆ సినిమాలు ఇప్పుడు ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయో ఒకసారి చూడండి.

హిట్లర్ - యూట్యూబ్

ఎప్పుడో 27 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ హిట్లర్. ఐదుగురు చెల్లెళ్ల బాధ్యతలు చూసే అన్నగా ఈ మూవీలో చిరు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాను ఇప్పుడు యూట్యూబ్ లో చూడొచ్చు.

రాఖీ - యూట్యూబ్

జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ మూవీ కూడా అన్నచెల్లెళ్ల సెంటిమెంటుతో వచ్చిన సినిమానే. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించింది. ఈ మూవీ కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

అన్నవరం - జీ5 ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అన్నవరం కూడా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టిన సినిమాగా చెప్పొచ్చు. ఈ మూవీలో పవన్ చెల్లెలి పాత్రలో సంధ్య నటించింది. ప్రస్తుతం ఈ సినిమాను జీ5 ఓటీటీలో చూడొచ్చు.

అర్జున్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ మూవీ అక్కాతమ్ముళ్ల సెంటిమెంటుతో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా.. ఇప్పటికీ రాఖీ పండుగ నాడు చూడాల్సిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సినిమాను చూడొచ్చు.

గోరింటాకు - జీ5 ఓటీటీ

రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించిన మూవీ గోరింటాకు. కన్నడ మూవీ అన్న తంగికి రీమేక్ అయిన ఈ సినిమా ప్రస్తుతం జీ5 ఓటీటీతోపాటు యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంది.

పుట్టింటికి రా చెల్లి - యూట్యూబ్

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన పుట్టింటికి రా చెల్లి మూవీ కూడా రక్షా బంధన్ రోజు చూడాల్సిన సినిమానే. 2004లో రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

హిందీలోనూ ఇలా తోబుట్టువల సెంటిమెంటుతో వచ్చిన మూవీస్ ఉన్నాయి. వాటిలో దిల్ ధడక్‌నే దో (నెట్‌ఫ్లిక్స్), రక్షాబంధన్ (జీ5 ఓటీటీ), సరబ్‌జీత్ (యూట్యూబ్), భాగ్ మిల్కా భాగ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)లాంటి సినిమాలు ఉన్నాయి. సోమవారం (ఆగస్ట్ 19) రాఖీ పండుగ సందర్భంగా ఓటీటీల్లో ఉన్న ఈ సినిమాలను మిస్ కాకుండా చూడండి. వీటిలో చాలా వరకు సినిమాలు సబ్‌స్క్రిప్షన్ లేదంటే ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి.