OTT Psychological Thriller: ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం.. ఉత్కంఠతో కట్టిపడేసే మూవీ!
OTT Psychological Thriller: ట్రాప్ చిత్రం ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం రెంట్ లేకుండా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇండియాలో ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది.
సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘ట్రాప్’ సూపర్ హిట్ అయింది. ఆగస్టు 2న థియేటర్లలో రిలీజైన ఈ హాలీవుడ్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్‍గా సక్సెస్ సాధించింది. ఈ మూవీలో జోష్ హార్ట్‌నెట్ ప్రధానపాత్రలో నటించారు నటించారు. నైట్ ష్యామలాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో రెంటల్ విధానంలో ఉంది. అయితే, ఇప్పుడు రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
ట్రాప్ చిత్రం జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జనవరి 2) స్ట్రీమింగ్‍కు రానుంది. రెంట్ లేకుండా పూర్తిస్థాయి స్ట్రీమింగ్ ఉంటుంది. జియోసినిమా ప్రీమియం సబ్‍స్క్రైబర్లందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు.
ట్రాప్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షో లాంటి ప్లాట్‍ఫామ్‍ల్లో రెండు నెలల కిందటే రెంటల్ విధానంలో స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అయితే, ఇప్పుడు రెంట్ లేకుండా జియోసినిమా ఓటీటీలో ఇండియాలోకి ఈ చిత్రం అందుబాటులోకి వస్తోంది.
ట్రాప్ సినిమాలో జోష్ హార్ట్‌నెట్‍తో పాటు ఏరియల్ డోనోగ్, సలేకా నైట్ ష్యామలాన్, హేలీ మిల్స్, అలీసన్ పిల్, జొనాథన్, మారీ మెక్‍ఫైల్ డైమండ్ కీలకపాత్రలు పోషించారు. ఓ సీరియల్ కిల్లర్.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం చుట్టూ సాగుతుంది. ఈ మూవీని గ్రిప్పింగ్‍గా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు డైరెక్టర్ నైట్ ష్యామలాన్.
ట్రాప్ కలెక్షన్లు
ట్రాప్ సినిమా 30 మిలియన్ డాలర్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రానికి ఆరంభంలో మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదరగొట్టింది. సుమారు 82 మిలియన్ డాలర్ల (సుమారు రూ.703కోట్ల) కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది.
ట్రాప్ చిత్రాన్ని బ్లైండింగ్ ఎడ్జ్ పిక్చర్స్ పతాకంపై అశ్విన్ రాజన్, మార్క్ బీన్‍స్టాక్, నైట్ ష్యామలాన్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి హెర్డిస్ స్పెఫాన్‍సోటిర్ సంగీతం అందించగా.. సాయోంబూ ముకేడీప్రోమ్ సినిమాటోగ్రఫీ చేశారు.
వరుస హత్యలకు పాల్పడిన కూపర్ అబాట్ (జోష్ హార్ట్‌నెట్) ఓ కాన్సెర్ట్‌కు కూతురితో కలిసి వెళతాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టు ముడతాడు. దిగ్భందనం చేస్తారు. అబాట్ తప్పించుకున్నాడా.. ఏం జరిగింది అనే అంశం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. సినిమా ఆసాంతం ఉత్కంఠతో సాగుతుంది.
సంబంధిత కథనం