Thriller OTT: ఓటీటీలోకి ఉత్కంఠతో సాగే థ్రిల్లర్ సినిమా.. ఒకే ఆన్‍స్క్రీన్ పాత్ర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-ott psychological thriller crazxy now streaming on amazon prime video ott rental basis ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thriller Ott: ఓటీటీలోకి ఉత్కంఠతో సాగే థ్రిల్లర్ సినిమా.. ఒకే ఆన్‍స్క్రీన్ పాత్ర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Thriller OTT: ఓటీటీలోకి ఉత్కంఠతో సాగే థ్రిల్లర్ సినిమా.. ఒకే ఆన్‍స్క్రీన్ పాత్ర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Psychological Thriller: క్రేజీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తెరపై ఒకే పాత్ర కనిపిస్తుంది. మిగిలిన క్యారెక్టర్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఆద్యంతం ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

OTT Psychological Thriller: ఓటీటీలోకి ఉత్కంఠతో సాగే థ్రిల్లర్ సినిమా.. ఒకే ఆన్‍స్క్రీన్ పాత్ర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

సోహమ్ షా ప్రధాన పాత్ర పోషించిన క్రేజీ (Crazxy) సినిమా ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తుంబాడ్ చిత్రాన్ని నిర్మించిన సోహం షా ఫిల్మ్స్ పతాకం నుంచి రావటంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. క్రేజీ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి గిరీశ్ కోహ్లాీ దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

స్ట్రీమింగ్ వివరాలివే

క్రేజీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు నేడు (ఏప్రిల్ 12) వచ్చింది. ప్రస్తుతం రెంటల్ పద్ధతిలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఈ చిత్రం ఏప్రిల్ 25న రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో అప్పుడు రెంట్ లేకుండా ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లంతా చూడొచ్చు. ఇప్పుడు చూడాలంటే రెంట్ చెల్లించాలి.

ఒకే ఆన్‍స్క్రీన్ క్యారెక్టర్

క్రేజీ సినిమా ఓ రాత్రి జరిగే ఘటనల చుట్టూ సాగుతుంది. ఈ మూవీని పక్కా థ్రిల్లర్‌గా తెరకెక్కించారు గిరీశ్. ఈ చిత్రంలో తెరపై అభిమన్యు సూద్ పాత్ర పోషించిన సోహమ్ షా మాత్రమే కనిపిస్తారు. మిగిలిన పాత్రలవి కేవలం వాయిస్ మాత్రమే ఉంటుంది. ఈ చిత్రానికి టిన్నూ ప్రసాద్, నిమిషా సంజయన్, శిల్పా శుక్లా, పియూష్ మిశ్రా వాయిస్ ఓవర్ రోల్స్ చేశారు. తెరపై మాత్రం కనిపించరు.

క్రేజీ మూవీ స్టోరీలైన్

తన నిర్లక్ష్యం వల్లే ఓ రోగి చనిపోయాడనే అభియోగం డాక్టర్ అభిమన్యు సూద్ (సోహమ్ షా)పై పడుతుంది. ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ.5కోట్లతో సెటిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రూ.5కోట్లను ఇచ్చేందుకు ఓ రాత్రి బయలుదేరతాడు అభిమన్యు. అప్పుడే అతడి కూతురిని కిడ్నాప్ చేశామని, రూ.5కోట్ల ఇస్తేనే వదిలేస్తామని అతడికి కాల్ వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో అభిమన్యు పడతాడు. మానసికంగా మదన పడతాడు. మరి చివరికి అభిమన్యు ఏం చేశాడు? కూతురిని కాపాడుకున్నాడా.. లేకపోతే సెటిల్మెంట్‍ చేసుకున్నాడా? అనే అంశాలు క్రేజీ చిత్రంలో ఉంటాయి.

క్రేజీ మూవీ నిడివి సుమారు గంటన్నరే ఉంటుంది. ఈ చిత్రాన్ని సోహం షా ఫిల్మ్స్ పతాకంపై సోహం షా, ముకేశ్ షా, అమితా షా, అభిషేక్ ప్రసాద్, అంకిత్ జైన్ ప్రొడ్యూజ్ చేశారు. తుంబాడ్ తర్వాత ఆ పతాకంపై వచ్చిన మూవీ కావడంతో ఆసక్తిని రేపింది. క్రేజీ చిత్రానికి మంచి టాకే వచ్చింది. కమర్షియల్‍గానూ సక్సెస్ సాధించింది. సుమారు రూ.8.4 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.15కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనా.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం