OTT Prabhas Interview: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. త్వరలోనే అంటూ..-ott prabhas interview etv win ott to stream rebel star special interview soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Prabhas Interview: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. త్వరలోనే అంటూ..

OTT Prabhas Interview: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. త్వరలోనే అంటూ..

Hari Prasad S HT Telugu
Published Oct 21, 2024 01:29 PM IST

OTT Prabhas Interview: ప్రభాస్ ఇంటర్వ్యూల్లో కనిపించడం చాలా అరుదు. ఎప్పుడో సినిమాల ప్రమోషన్లు ఉంటే గానీ అతడు బయటకు రాడు. కానీ ఇప్పుడు ఈటీవీలో అతడు ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. త్వరలోనే అంటూ..
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఈటీవీ విన్ ఓటీటీ.. త్వరలోనే అంటూ..

OTT Prabhas Interview: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అంటూ ఈటీవీ విన్ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ ఇంటర్వ్యూకు సంబంధించిన చిన్న క్లిప్ కూడా ఉంది. నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో ఈటీవీలో సిరివెన్నెల సీతారామశాస్త్రిపై వచ్చే సెలబ్రిటీల ఇంటర్వ్యూల్లో ఈసారి ప్రభాస్ మెరవనున్నాడు.

ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ

ప్రభాస్ అభిమానులను మురిపించే వార్త ఇది. బుధవారం (అక్టోబర్ 23) అతని బర్త్ డేను ఘనంగా జరుపుకోవడానికి ఫ్యాన్స్ సిద్ధమవుతున్న వేళ.. ఈటీవీ విన్ ఓటీటీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. "డియర్ డార్లింగ్ ఫ్యాన్స్.. వెయిట్ ముగిసింది.. ఈటీవీ విన్ చూస్తూనే ఉండండి.. మా టీమ్ సండే అంటున్నారు మరి.. 5 వేల రీట్వీట్స్ వస్తే ముందే రిలీజ్ చేస్తా" అనే క్యాప్షన్ తో ప్రభాస్ ఇంటర్వ్యూకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది ఈటీవీ విన్.

దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిపై నడిచే సెలబ్రిటీ టాక్ షో నా ఉచ్ఛ్వాసం కవనంలో భాగంగా ప్రభాస్ అతనిపై తన అనుభవాలను పంచుకున్నాడు. ఒక నిమిషం 19 సెకన్ల ఈ వీడియోలో ప్రభాస్.. సీతారామశాస్త్రి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ముఖ్యంగా వర్షం మూవీలో అతడు రాసిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు కదా. ఆ మూవీలోని రెండు పాటలను ప్రభాస్ కొంచెం పాడి వినిపించాడు కూడా.

ఈటీవీలో నా ఉచ్ఛ్వాసం కవనం షో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. అయితే ఈటీవీ విన్ ఓటీటీలో ఈ షో ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.

ప్రభాస్ బర్త్ డే

మరోవైపు ప్రభాస్ బుధవారం (అక్టోబర్ 23) తన 45వ పుట్టిన రోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా థియేటర్లలో అతనికి ఆరు సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. వీటిని చూడటానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అదే రోజు ది రాజా సాబ్ తోపాటు అతని భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో కూడా అతని పుట్టినరోజు నాడే ఈ స్పెషల్ ఇంటర్వ్యూను కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే డార్లింగ్ ఫ్యాన్స్ కు నిజంగా పండగే. సలార్, కల్కి 2898 ఏడీ సక్సెస్ లతో అతని ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీంతో ఈసారి ప్రభాస్ బర్త్ డే వేడుకలు చాలా ఘనంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Whats_app_banner