OTT Play Awards 2025 Winners List: అన్ని ఓటీటీలోని సినిమాలను, వెబ్ సిరీస్‌లను, షోలను ఒకేదాంట్లో అందించే ప్లాట్‌ఫామ్ ఓటీటీ ప్లే యాప్. ఇండియాలో పాపులర్ అయిన ఈ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ ఓటీటీ ప్లే 2025 అవార్డ్స్ మార్చి 22న ముంబైలో అట్టహాసంగా జరిగాయి. "ఒకే దేశం-ఒకే అవార్డ్" అంటూ సాగిన ఓటీటీ ప్లే 2025 మూడో ఎడిషన్ అవార్డ్స్‌లో విజేతలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తమ చిత్రం- గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా)
ఉత్తమ దర్శకుడు (సినిమా)- ఇంతియాజ్ (అలీ అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అనుపమ్ ఖేర్ (విజయ్ 69, ది సిగ్నేచర్)
ఉత్తమ నటుడు (పాపులర్)- మనోజ్ బాజ్‌పాయ్ (డిస్పాచ్ చిత్రం)
ఉత్తమ నటి (క్రిటిక్స్)- పార్వతి తిరువోత్తు (మనోరథంగల్)
ఉత్తమ నటి (పాపులర్)- కాజోల్ (దోపత్తి)
ఉత్తమ విలన్- సన్నీ కౌశల్ (ఫిర్ ఆయే హసీనా దిల్‌రూబా)
ఉత్తమ హాస్యనటి- ప్రియమణి (భామాకలాపం 2)
నటనలో ప్రతిభ కనబరించిన నటుడు- అవినాష్ (తివారి ది మెహతా బాయ్స్)
నటనలో ప్రతిభ కనబరిచిన నటి- షాలినీ పాండే (మహరాజ్)
ఉత్తమ వెబ్ సిరీస్- పంచాయత్ 3
ఉత్తమ దర్శకుడు- నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్)
ఉత్తమ నటుడు (పాపులర్)- రాఘవ్ జ్యూయెల్ (గ్యారా గ్యారా)
ఉత్త నటుడు (క్రిటిక్స్)- జైదీప్ అహ్లావత్ (పాతాళ్ లోక్ సీజన్ 2)
ఉత్తమ నటి (పాపులర్)- అదితి రావు హైదరి (హీరామండి)
ఉత్తమ నటి (క్రిటిక్స్)- నిమేషా సజయన్ (పోచర్)
ఉత్తమ సహాయ నటుడు- రాహుల్ భట్ (బ్లాక్ వారెంట్)
ఉత్తమ సహాయ నటి- జ్యోతిక (డబ్బా కార్టెల్)
ఉత్తమ హాస్య నటుడు- నీరజ్ మాధవ్ (లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్)
నటలో ప్రతిభ కనబర్చిన నటుడు- అభిషేక్ కుమార్ (తలైవేట్టయాన్ పలయం)
నటనలో ప్రతిభ కనబర్చిన నటి- పత్రలేఖ (ఐసీ 814)
మరికొన్ని ఓటీటీ ప్లే అవార్డ్స్ క్యాటగిరీలు, విజేతలు
ఉత్తమ టాక్ షో హోస్ట్- రానా దగ్గుబాటి (ది రానా టాక్ షో)
ఉత్తమ రియాలిటీ షో- ది ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్
ఉత్తమ నాన్ స్క్రిప్ట్ షో- షార్క్ ట్యాంక్ (బిమల్ ఉన్ని కృష్ణన్, రాహుల్ హోట్‌చందని)
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ (నటుడు)- శ్రీమురళి (బఘీర)
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ (నటి)- దివ్యా దత్తా (శర్మాజీ కీ బేటీ, బందిష్ బాండిట్స్ సీజన్ 2)
వెర్సటైల్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ (నటి)-కని కుశ్రుతి (గర్ల్స్ విల్ బీ గర్ల్స్, పోచర్, తలైమలై సెయ్యలాగమ్, నాగేంద్రన్స్ హనీమూన్)
వెర్సటైల్ పర్పార్మర్ ఆఫ్ ది ఇయర్ (నటుడు)- సిద్ధాంత్ గుప్త (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్, బ్లాక్ వారెంట్)
ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్- ది రోషన్స్ (రాజేష్ రోషన్, రాకేష్ రోషన్, శశి రంజన్)
పయనీర్ కంట్రిబ్యూషన్స్ టు న్యూ వేవ్ సినిమా- అశ్విన్ పునీత్ రాజ్‌కుమార్
ప్రామిసింగ్ నటుడు- అపరశక్తి ఖురానా (బెర్లిన్ మూవీ)
ప్రామిసింగ్ నటి- హినా ఖాన్ (గృహలక్ష్మి వెబ్ సిరీస్)
బెస్ట్ ఓటీటీ సిరీస్ డెబ్యూట్- వేదిక (యక్షిణి)
రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్- అవనీత్ కౌర్ (పార్టీ టిల్ ఐ డై)
ఇలా ఈ ఏడాది ఓటీటీ ప్లే అవార్డ్స్‌లో తెలుగు వారికి పరిచయం ఉన్న రానా దగ్గుబాటి, ప్రియమణి, వేదిక, షాలినీ పాండే, జ్యోతిక, అదితి రావు హైదరి, మనోజ్ బాజ్‌పేయ్, కాజోల్, అనుపమ్ ఖేర్, శ్రీమురళి అవార్డ్స్ అందుకున్నారు. ఓటీటీ బోల్డ్ మూవీ అని గర్ల్స్ విల్ బీ గర్ల్స్‌కు ఉత్తమ చిత్రంగా అవార్డ్ రాగా అందులో నటించిన కని కుశ్రుతికి బహుముఖ ప్రజ్ఞశాలి నటి విభాగంలో పురస్కారం లభించింది.
సంబంధిత కథనం