Romantic Thriller Movie: రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం (జూన్ 21) నుంచి రసవతి అనే తమిళ థ్రిల్లర్ మూవీ ఆహా తమిళంతోపాటు ప్రైమ్ వీడియో ఓటీటీల్లో చూడొచ్చు. థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
రసవతి అనే ఈ తమిళ రొమాంటిక్ రివేంజ్ డ్రామాలో అర్జున్ దాస్, తాన్యా రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఇప్పుడు ఆహా తమిళంతోపాటు ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులో ఉంది. గతంలో మగముని, మౌనగురులాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన శాంతకుమార్ ఈ రసవతిని డైరెక్ట్ చేశారు. ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన మేర పర్ఫామ్ చేయలేకపోయింది.
ఈ మధ్యకాలంలో టాప్ తమిళ సినిమాలను సొంతం చేసుకుంటున్న ఆహా తమిళం ఓటీటీ ఈ రసవతి హక్కులను కూడా దక్కించుకుంది. ఇదే కాకుండా ఈ మధ్యే ఆహా తమిళ్ ఓటీటీలో కురంగు పెడల్, హాట్ స్పాట్, ది బాయ్స్, సిరగన్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు రసవతి రూపంలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కూడా వచ్చి చేరింది.
రసవతి మూవీలో అర్జున్ దాస్ సదాశివ పాండ్యాన్ అనే ఓ సిద్ధ డాక్టర్ గా కనిపించాడు. ఇక సూర్య అనే ఓ హోటల్ మేనేజర్ పాత్రలో తాన్య రవిచంద్రన్ నటించింది. ఈ ఇద్దరూ కొడైకెనాల్లో పని చేస్తుంటారు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడతారు. అక్కడికి కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి పరశురాజ్ (సుజిత్ శంకర్) ఈ ఇద్దరినీ చూసి మండిపోతూ ఉంటాడు.
వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతుంటాడు. ఎదుటి వాళ్లు సంతోషంగా చూసి ఓర్వలేని వాళ్లలాంటి పాత్రలాగానే మొదట్లో పరశురాజ్ పాత్ర కనిపిస్తుంది. కానీ ఈ ముగ్గురికీ ఉన్న గతాలు, ప్రస్తుతానికి ఉన్న లింకుతోనే కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రధానంగా ఈ మూడు పాత్రలు చుట్టూనే తిరిగే కథే ఈ రసవతి మూవీ.
ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీకి మ్యూజిక్ తమన్ అందించడం విశేషం. శరవణన్ ఇళవరసు సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. వీజే సాబు ఎడిటర్ గా ఉన్నాడు. రసవతి మూవీ డైరెక్ట్ చేసిన శాంతకుమారే సరస్వతి సినీ క్రియేషన్ తో కలిసి నిర్మించాడు. మే 10న థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ టాక్ తో ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
టాపిక్