OTT Mythological Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..
OTT Mythological Thriller: ఓటీటీలోకి ఓ మైథలాజిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శుక్రవారం (అక్టోబర్ 25) అడుగుపెట్టింది. ఈ తమిళ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన సిరీస్ కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
OTT Mythological Thriller: థ్రిల్లర్ కు మైథాలజీని జోడించి తీసుకొచ్చిన వెబ్ సిరీస్ ఐందమ్ వేదమ్. ఇదొక తమిళ వెబ్ సిరీస్. ఎల్ నాగరాజన్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ వెబ్ సిరీస్ లోని థ్రిల్ ను ఎంజాయ్ చేయొచ్చు.
ఐందమ్ వేదమ్ ఓటీటీ స్ట్రీమింగ్
తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐందమ్ వేదమ్. అంటే తెలుగులో ఐదో వేదం అని అర్థం. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం (అక్టోబర్ 25) నుంచి జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని రోజుల కిందట ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసిన జీ5 ఓటీటీ దీనిపై ఆసక్తి రేపింది.
నాగరాజన్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో సాయి ధన్షిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్ లాంటి వాళ్లు నటించారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. 1990ల్లో ఈటీవీలో వచ్చిన మర్మదేశం గుర్తుంది కదా. ఆ డైరెక్టరే ఈ సిరీస్ ను తెరకెక్కించడంతో దీనిపై ఎంతో ఆసక్తి నెలకొంది.
ఐందమ్ వేదమ్ స్టోరీ లైన్ ఇదే
ఐందమ్ వేదమ్ వెబ్ సిరీస్ అను (సాయి ధన్షిక) అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. తన తల్లి అంత్యక్రియల కోసం వారణాసి వచ్చే ఆమె జీవితం అక్కడ ఊహించని మలుపు తిరుగుతుంది. తనకు ఇష్టం లేకపోయినా ఓ రహస్యం దాగి ఉన్న బాక్స్ ను తమిళనాడులోని అయంగారపురం అనే చిన్న టౌన్ కి తీసుకెళ్లే బాధ్యతను ఆమె మోయాల్సి వస్తుంది.
ఓ సింగర్ కావాలని ఆమె కన్న కలలు ఆ ఊరికి వెళ్లిన తర్వాత మరో మలుపు తిరుగుతాయి. సూపర్ నేచురల్ థ్రిల్లర్స్ ను ఆసక్తికరంగా మలిచే నాగరాజన్.. ఈ వెబ్ సిరీస్ లో బయో ఇంక్, ఐదో వేదం లాంటి ఆసక్తికరమైన విషయాలను టచ్ చేశాడు. మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారిని ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది.
అందులోనూ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుండటంతో హాయిగా ఈ ఐందమ్ వేదమ్ సిరీస్ చూసేయొచ్చు. దీనికోసం జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలు. ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ ను మాత్రం ఫ్రీగా చూసే వీలు కల్పించారు.