OTT: ఒకే ఒక్క పాత్రతో వచ్చిన 7 ఓటీటీ సినిమాలు.. తెలుగులో 6 స్ట్రీమింగ్.. హారర్ టు క్రైమ్ థ్రిల్లర్- మీరెన్ని చూశారు?-ott movies with single role in telugu on aha amazon prime disney plus hotstar hello meera 105 minutes panchami streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఒకే ఒక్క పాత్రతో వచ్చిన 7 ఓటీటీ సినిమాలు.. తెలుగులో 6 స్ట్రీమింగ్.. హారర్ టు క్రైమ్ థ్రిల్లర్- మీరెన్ని చూశారు?

OTT: ఒకే ఒక్క పాత్రతో వచ్చిన 7 ఓటీటీ సినిమాలు.. తెలుగులో 6 స్ట్రీమింగ్.. హారర్ టు క్రైమ్ థ్రిల్లర్- మీరెన్ని చూశారు?

Sanjiv Kumar HT Telugu

OTT Movies With Single Role In Telugu: ఓటీటీలో కేవలం ఒకే ఒక్క పాత్రతో వచ్చిన 7 సినిమాలను ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో స్టార్ హీరోయిన్ హన్సిక నుంచి హీరో సుమంత్ వరకు స్పెషల్ మూవీస్ ఉన్నాయి. ఇక ఇవి హారర్, క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లతో 6 సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలో కేవలం ఒకే ఒక్క పాత్రతో వచ్చిన 7 సినిమాలు

OTT Movies With Single Role: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు అలరిస్తున్నాయి. అయితే, సినిమా అన్నాక చాలా మంది నటీనటులు ఉంటారు. కానీ, కేవలం ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. కేవలం సింగిల్ పాత్రతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 7 సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

హలో మీరా ఓటీటీ

పెళ్లి బట్టల కోసం షాపింగ్‌కు వెళ్లిన అమ్మాయికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చి అక్కడే ఇరుక్కుపోతే. ఈ కాన్సెప్ట్ పైన వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే హలో మీరా. కేవలం గంట 33 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా కేవలం ఒకే ఒక్క పాత్రతో సాగుతుంది. ప్రస్తుతం హలో మీరా మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

రారా పెనిమిటి ఓటీటీ

తెలుగు ముద్దుగుమ్మ నందిత శ్వేత నటించిన ఎమోషనల్ డ్రామా చిత్రం రారా పెనిమిటి. ఎన్టీఆర్ అరవింద సినిమాలోని పాటతో టైటిల్‌గా వచ్చిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. సత్య వెంకట్ దర్శకత్వం వహించారు. భర్త కోసం ఎదురుచూసే గృహిణి చుట్టూ జరిగే ఈ రారా పెనిమిటి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇది ఇండియాలో అందుబాటులో లేదు. కేవలం ఇతర దేశాల వాళ్లు చూసే వీలు కల్పించారు.

అహం రీబూట్ ఓటీటీ

టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా అహం రీబూట్. రేడియో జాకీగా పని చేసే వ్యక్తికి ఓ అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. ఆ తర్వాత ఏమైందనే కథనంతో సాగే అహం రీబూట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్. కేవలం సుమంత్ సింగిల్ క్యారెక్టర్‌తో సాగే అహం రీబూట్ తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.

ఎలోన్ ఓటీటీ

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ ఎలోన్. మలయాళంలో ప్లాప్‌ టాక్ తెచ్చుకున్న ఎలోన్ జియోహాట్‌స్టార్‌ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కరోనా లాక్‌డౌన్‌లో వివిధ ప్రాంతాలు తిరిగే పాత్రలో మోహన్ లాల్ నటించిన ఈ ఎలోన్ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

తాషేర్ ఘౌర్ ఓటీటీ

ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన బెంగాలీ మూవీ తాషేర్ ఘౌర్. స్వస్తికా ముఖర్జీ మాత్రమే నటించిన తాషేర్ ఘౌర్ అమెజాన్ ప్రైమ్, హోయ్‌చోయ్ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అత్త, భర్తలను చంపే గృహిణి స్టోరీగా రూపొందిన తాషేర్ ఘౌర్ బెంగాలీ, హిందీ భాషలో మాత్రమే ఓటీటీ రిలీజ్ అయింది.

105 మినిట్స్ ఓటీటీ

స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ ఒక్కరే నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్. రెండు గంటల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా అమెజాన్, ఆహా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హన్సిక చేసిన ప్రయోగాత్మక సినిమా 105 మినిట్స్ తెలుగులో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అందుబాటులో ఉంది.

పంచమి ఓటీటీ

నువ్వొస్తానంటే నేను వద్దంటానా ఫేమ్, బిగ్ బాస్ తెలుగు 1 కంటెస్టెంట్ అర్చన (Archana Shastry) నటించిన తెలుగు యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పంచమి. అర్చన ఒకే ఒక్క పాత్రలో నటించిన పంచమి అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం