OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. అల్లు హీరో మూవీతో పాటు మరిన్ని..-ott movies web series releases this week buddy murshid to ic 814 and more on netflix zee5 jiocinema and prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. అల్లు హీరో మూవీతో పాటు మరిన్ని..

OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. అల్లు హీరో మూవీతో పాటు మరిన్ని..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 25, 2024 10:52 PM IST

OTT Release This Week: ఓటీటీల్లో ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ చిత్రం ఈవారంలోనే ఓటీటీలోకి రానుంది. ఓ హాలీవుడ్ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వస్తోంది. కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‍లు కూడా రానున్నాయి.

OTT Release This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. అల్లు హీరో మూవీతో పాటు మరిన్ని..
OTT Release This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. అల్లు హీరో మూవీతో పాటు మరిన్ని..

ఆగస్టు చివరి వారం వచ్చేసింది. ఈ వారం (ఆగస్టు 25 నుంచి 31) కూడా వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. బడ్డీ తెలుగు చిత్రం ఈవారమే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ చిత్రం తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. మరిన్ని చిత్రాలతో పాటు ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఏవో ఇక్కడ చూడండి.

నెట్‍ఫ్లిక్స్

బడ్డీ - అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా ఈవారం ఆగస్టు 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజైంది. అయితే, సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన బడ్డీ మూవీ థియేటర్లలో అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను సాధించలేకపోయింది. నెలలోపే ఆగస్టు 30న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో బడ్డీ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

ఐసీ 814: ది కాందహార్ హైజాక్ - వెబ్ సిరీస్ - హిందీ - నెట్‍ఫ్లిక్స్ - ఆగస్టు 29

పొలైట్ సొసైటీ - సినిమా - ఇంగ్లిష్ - నెట్‍ఫ్లిక్స్ - ఆగస్టు 28

కేఏఓఎస్ - వెబ్ సిరీస్ - ఇంగ్లిష్ - నెట్‍ఫ్లిక్స్ - ఆగస్టు 29

టెర్మినేటర్ జీరో - వెబ్ సిరీస్ - ఇంగ్లిష్ - నెట్‍ఫ్లిక్స్ - ఆగస్టు 29

జియోసినిమా

గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ - హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ ఆగస్టు 29వ తేదీన జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆగస్టు 29 నుంచి గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ మూవీని జియో సినిమాలో చూడొచ్చు.

అబిగలి - సినిమా - ఇంగ్లిష్ - జియోసినిమా - ఆగస్టు 26

క్యాడెట్స్ - వెబ్ సిరీస్ - హిందీ - జియోసినిమా - ఆగస్టు 30

జీ5

ఇంటెరాగేషన్ - సినిమా - హిందీ - జీ5 - ఆగస్టు 30

ముర్షిద్ - వెబ్ సిరీస్ - హిందీ - జీ5 - ఆగస్టు 30

డిస్నీ+ హాట్‍స్టార్

ముంజ్య - బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ముంజ్య నేడే (ఆగస్టు 25) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వంలో శార్వరీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ హిందీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. జూన్ 7న థియేటర్లలో రిలీజైన ముంజ్య బ్లాక్‍బస్టర్ అయింది.

ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 4 - వెబ్ సిరీస్ - ఇంగ్లిష్ - డిస్నీ+ హాట్‍స్టార్ - ఆగస్టు 27

కనా కానుమ్ కాలంగల్ సీజన్ 3 - వెబ్ సిరీస్ - తమిళం - డిస్నీ+ హాట్‍స్టార్ - ఆగస్టు 30

ప్రైమ్ వీడియో

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 - వెబ్ సిరీస్ - ఇంగ్లిష్ - అమెజాన్ ప్రైమ్ వీడియో - ఆగస్టు 29