OTT Best Movies: ఓటీటీలో ది బెస్ట్ 5 సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైమ్ పాస్.. ఎక్కడెక్కడ చూడాలంటే?-ott movies to watch this weekend hisaab barabar sivarapalli sweet dreams streaming on hotstar zee5 amazon prime netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Best Movies: ఓటీటీలో ది బెస్ట్ 5 సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైమ్ పాస్.. ఎక్కడెక్కడ చూడాలంటే?

OTT Best Movies: ఓటీటీలో ది బెస్ట్ 5 సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైమ్ పాస్.. ఎక్కడెక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 26, 2025 08:15 AM IST

OTT Movies To Watch On This Weekend: ఓటీటీలో ఈ వారం ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన ది బెస్ట్ ఐదు సినిమాలను ఇక్కడ సజెషన్ కింద తెలియజేశాం. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్‌లో బ్యాంక్ క్రైమ్, సర్వైవల్ ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీ, రొమాంటిక్ సినిమాలు ఉన్నాయి.

ఓటీటీలో ది బెస్ట్ 5 సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైమ్ పాస్.. ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలో ది బెస్ట్ 5 సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైమ్ పాస్.. ఎక్కడెక్కడ చూడాలంటే?

OTT Best Movies To Watch This Weekend: నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అయ్యాయి. వాటిలో మీరు ఈ వీకెండ్‌కు ఇంట్లో హాయిగా కూర్చోని ఎంజాయ్ చేసే ది బెస్ట్ ఐదు సినిమాలను ఇక్కడ మూవీ సజెషన్ కింద తెలియజేస్తున్నాం. వివిధ జోనర్స్‌లో తెరకెక్కిన ఈ ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్‌పై ఓ లుక్కేయండి.

yearly horoscope entry point

హిసాబ్ బరాబర్ ఓటీటీ

ఆర్ మాధవన్ రైల్వే టికెట్ కలెక్టర్‌ రాధే మోహన్ శర్మగా మెయిన్ లీడ్ రోల్ చేసిన డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ హిసాబ్ బరాబర్. ఈ సిరీస్ బ్యాంక్ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. ఓ రోజు రాధే మోహన్ శర్మ బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత డబ్బు కట్ అవుతుంది.

దాని గురించి ఆరా తీస్తే అది బ్యాంక్ వాళ్లు చేస్తున్న పెద్ద స్కామ్ అని తెలుస్తుంది. దాంతో రాధే మోహన్ ఏం చేశాడు అనేదే మిగతా కథ. హిసాబ్ బరాబర్ జీ5 ఓటీటీలో హిందీ, తెలుగు, తమిళం భాషల్లో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

సివరపల్లి ఓటీటీ

రాగ్ మయూర్ మెయిన్ లీడ్ రోల్ చేసిన సివరపల్లి కామెడీ వెబ్ సిరీస్ సూపర్ హిట్ సిరీస్ పంచాయత్‌కు తెలుగు రీమెక్. తెలంగాణలోని సివరపల్లి అనే మారుమూల గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా వెళ్లిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. జనవరి 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సివరపల్లిలో మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె, పావని కరణం నటించారు.

స్వీట్ డ్రీమ్స్ ఓటీటీ

అమోల్ పరాషర్, ఓరి దేవుడా హీరోయిన్ మిథిలా పాల్కర్ జంటగా నటించిన రొమాంటిక్ సినిమా స్వీట్ డ్రీమ్స్. నిజ జీవితంలో ఎప్పుడు కలవని కలలు కనే కెన్నీ, డయా ఇద్దరు స్ట్రేంజర్స్. అలాంటి కెన్నీ, డయా ఎలా ప్రేమలో పడ్డారన్నదే స్టోరీ. ఈ రొమాంటిక్ మూవీ జనవరి 24 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది.

ది సాండ్ కాస్టెల్ ఓటీటీ

జనవరి 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న లెబనీస్ ఫ్యామిలీ సర్వైవల్ థ్రిల్లర్ ది సాండ్ కాస్టెల్. ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఓ ద్వీపంలో చిక్కుకుపోయిన ఈ కుటుంబ సభ్యులు మనుగడకోసం ఎలా బయటపడ్డారన్నదే కథ.

ది నైట్ ఏజెంట్ ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది నైట్ ఏజెంట్ సీజన్ 2. గాబ్రియేల్ బాస్సో యాక్ట్ చేసిన సీజన్ 2లో సీఐఏ సంస్థలో రహస్యాలు బయటకు పంపే దేశద్రోహిని కనిపెట్టే మిషన్‌పై సాగుతుంది. ఇలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఈ వీకెండ్‌కు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేసేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం