OTT Movies On Womens Day 2025 Special: ఓటీటీల్లో అనేక రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అయితే, మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారతను పెంపొందించే, మహిళల్లో స్ఫూర్తినింపే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పింక్ మూవీ ఒక శక్తివంతమైన సోషల్ థ్రిల్లర్ మూవీ. లైంగిక స్వేచ్ఛ, వేధింపులు, మహిళ అంగీకారం తప్పనిసరి, మహిళలు ఎదుర్కొనే సాంఘిక సమస్యల వంటి అంశాలతో ఎంగేజింగ్‌గా తెరకెక్కింది పింక్. తమ గౌరవం, న్యాయం కోసం పోరాడే ముగ్గురు మహిళల పటిమను చూపిస్తూ స్ఫూర్తినింపే పింక్ జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ప్లెక్స్, గూగుల్ ప్లే మూవీస్, యాపిల్ టీవీ, యూట్యూబ్ వంటి 6 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ సీత అలియా భట్ నటించిన హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాజీ. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తానీ కుటుంబంలోకి చొరబడిన సెహమత్ అనే భారతీయ గూఢచారి ధైర్యం, దేశభక్తిని తెలియజేస్తుంది. ధైర్యం, త్యాగం వంటి అంశాలతో మహిళల్లో ఎంతో స్ఫూర్తినింపే రాజీ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ ఓటీటీల్లో ప్రసారం అవుతోంది.
కల్కి కొచ్చిన, సయాని గుప్త, రేవతి నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం మార్గరిటా విత్ ఏ స్ట్రా. మెదడు పక్షవాతం ఉన్న లైలా అమ్మాయి చుట్టూ సినిమా సాగుతుంది. ప్రేమ, శృంగారం, తనను తాను అంగీకరించడం వంటి అంశాల చుట్టూ ఎమోషనల్‌గా సాగుతుంది. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే, ధైర్యాన్ని నింపే మార్గరిటా విత్ ఏ స్ట్రా నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్, యూట్యూబ్ వంటి 5 ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇండియన్ బాక్సర్, మాజీ రాజ్యసభ సభ్యురాలు మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం మేరీ కోమ్. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీలో మేరీ కోమ్ ఎదుర్కొన్న సమస్యలు, పట్టుదల, దాటిన పరిస్థితుల, లక్ష్యాన్ని చేరుకోవడం అంశాలను చాలా ఇన్‌స్పైరింగ్‌గా తీశారు.
2014లో వచ్చిన ఈ సినిమా ప్రశంసలు దక్కించుకుంది. ఇక నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, వూట్, యూట్యూబ్, గూగుప్ ప్లే మూవీస్ వంటి 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో మేరీ కోమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
2016లో విడుదలైన హిందీ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం నీర్జా. 1986లో ఫ్లైట్ హైజాక్ సమయంలో ప్రయాణికులను కాపాడేందుకు తన ప్రాణాలు త్యాగం చేసిన అత్యంత ధైర్యవంతురాలు నీర్జా భానోట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన నీర్జా ఎంతో స్ఫూర్తివంతమైన సినిమా. జియో హాట్‌స్టార్, మనోరమ మ్యాక్స్, గూగుల్ ప్లే మూవీస్, యాపిల్ టీవీలో నీర్జా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం