OTT Suggestion: ఈ వారం ఓటీటీలో చూసేందుకు ఈ సినిమాలు, సిరీస్‌ బెస్ట్.. అవేంటంటే?-ott movies to watch on this weekend show time web series to damsel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott Movies To Watch On This Weekend Show Time Web Series To Damsel

OTT Suggestion: ఈ వారం ఓటీటీలో చూసేందుకు ఈ సినిమాలు, సిరీస్‌ బెస్ట్.. అవేంటంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 10, 2024 12:50 PM IST

OTT Movies Suggestions On This Week: ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చి కుప్పులుతెప్పలుగా పడుతూ ఉంటాయి. వాటిలో ఏది చూడాలి, చూడకూడదు అనే సందిగ్ధత ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ వారం ఓటీటీ మూవీస్ సజ్జెషన్ కింద ఈ సినిమాలు, వెబ్ సిరీసులను చూసి ఎంజాయ్ చేయండి.

ఈ వారం ఓటీటీలో చూసేందుకు ఈ సినిమాలు, సిరీస్‌ బెస్ట్.. అవేంటంటే?
ఈ వారం ఓటీటీలో చూసేందుకు ఈ సినిమాలు, సిరీస్‌ బెస్ట్.. అవేంటంటే?

OTT Movies To Watch: ప్రస్తుతం థియేటర్లలో గామి, భీమా సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటితోపాటు హిందీలో విడుదలైన హారర్ మూవీ సైతాన్ మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఇక థియేటర్లలో చూసేవారికంటే ఓటీటీలను ప్రిఫర్ చేసే వాళ్లు అధికం. అయితే, ప్రతివారం సినిమాలు, వెబ్ సిరీసులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడటంతో ఏది చూడాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అన్ని చూసే టైమ్ లేనివారికి ఈ ఓటీటీ మూవీస్ సజ్జెన్స్ ఫాలో అయిపోండి.

షో టైమ్ వెబ్ సిరీస్

మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'షోటైమ్'. సినిమా ఇండస్ట్రీలో వారసత్వం, వారసులపై ఉండే అంచనాలు, ఆశయం వంటి కథాంశాలతో షో టైమ్ తెరకెక్కింది. ఇది బాలీవుడ్ పరిశ్రమ తెర వెనుక ఏమి జరుగుతుందో ప్రేక్షకులకు ఒక హింట్ లాంటింది అని తెలుస్తోంది. నెపోటిజం, పైకి వచ్చేందుకు చేసే పోరాటం, పడే స్ట్రగుల్, ఇబ్బందులు వంటివి చూపించారు.

షోటైమ్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా విలన్ ఇమ్రాన్ హష్మీ, నసీరుద్దీన్ షా, నాగిని భామ మౌని రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. షో టైమ్ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar)లో హిందీతోపాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కిల్లర్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ ఇటీవల టైగర్ 3 మూవీతో విలన్‌గా అవతారం ఎత్తాడు.

మెర్రీ క్రిస్మస్ ఓటీటీ

థియేటర్లలో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న సినిమాల్లో మెర్రీ క్రిస్మస్ ఒకటి. జనవరిలో విడుదలై ప్రశంసలు అందుకున్న మెర్రీ క్రిస్మస్ సినిమా మార్చి 8 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన మెర్రీ క్రిస్మస్ మూవీలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు.

మెర్రీ క్రిస్మస్ చిత్రం 1980 బొంబాయి కాలంలో జరిగినట్లుగా చూపించారు. కథ విషయానికొస్తే.. ఆల్బర్ట్ (సేతుపతి) ముంబై నగరానికి క్రిస్మస్ రోజు తిరిగి వస్తాడు. అక్కడ ఒంటరిగా ఉన్న తల్లి మారియా (కత్రీనా కైఫ్), ఆమె కూతురుని క్రిస్మస్ ఈవ్‌లో కలుసుకుంటాడు. అక్కడ వాళ్లిద్దరి పరిచయం ఆ రాత్రి మారియా ఫ్లాట్‌ వెళ్లేవరకు వెళ్తుంది. ఆ తర్వాత మారియా ఫ్లాట్‌లో డెడ్ బాడీ కనిపించడంతో కథ మలుపు తిరుగుతుంది.

మహారాణి సీజన్ 3

బాలీవుడ్ గ్లామర్ బ్యూటి హ్యూమా ఖురేషి ముఖ్యమంత్రిగా నటించిన వెబ్ సిరీస్ మహారాణి. ఇప్పటికీ రెండు సీజన్స్ మంచి హిట్ కాగా వాటికి సీక్వెల్‌గా మూడో సీజన్ తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. ఈ సిరీసులో రాజకీయ ప్రత్యర్థులు, సొంత భర్త, కులం, లింగ వివక్షతో పోరాడి అధికారంలో కొనసాగే ముఖ్యమంత్రి నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో మార్చి 8 నుంచి మహారాణి సీజన్ 3 ప్రసారం అవుతోంది. ఈ కొత్త సీజన్‌లో రాణి భారతి (హ్యూమా ఖురేషి) మూడేళ్లపాటు జైలులో ఉంటే ఆమె రాజకీయ ప్రత్యర్థి నవీన్ (అమిత్ సియాల్) ముఖ్యమంత్రిగా ఉన్నారు.

డామ్‌సెల్

డామ్‌సెల్ స్పానిష్ దర్శకుడు జువాన్ కార్లోస్ ఫ్రెస్నాడిల్ తెరకెక్కించిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో తన రాణి చెప్పినట్లుగా చేసే అందమైన యువతి బ్రౌన్ పెళ్లి వివాహం కథాంశంతో సాగుతుంది. యువరాజును పెళ్లి చేసుకున్న తర్వాత బ్రౌన్ జీవితం ఎలా మారిపోయింది. బ్రౌన్ ఎలాంటి అడ్వెంచర్స్ చేసింది. ఎలా సర్వైవ్ అయింది అనే విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఈ డామ్‌సెల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 8 నుంచి ఇంగ్లీషుతోపాటు స్పానిష్, తెలుగు, హిందీ ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

WhatsApp channel