OTT Movies Holi: ఓటీటీలో హోలీ సెలబ్రేషన్స్ మూవీస్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
OTT Movies Holi To Watch: మార్చి 24న అంటే నేడు హోలీ పండుగ. చెడుపై మంచి గెలిచినందుకు జరుపుకునే వేడుక. హోలీ పండుగకు సంబంధించి అనేక సినిమాలు వచ్చాయి. మరి ఈ పండుగ రోజు సందర్భంగా ఈ హోలీ సినిమాలను ఈ ఓటీటీలో చూసేయండి.

OTT Movies Holi: హిందూ సాంప్రాదాయంలోని పండుగల్లో హోలీకి ఓ ప్రత్యేకత ఉంది. హోలీని రంగుల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలలో ఒకటి. ఈ సంవత్సరం మార్చి 25న హోలీ వస్తుంది. అయితే హోలికా దహన్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 24 (ఆదివారం) జరుపుకుంటారు. ఈ సందర్భంగా పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు ఈ హిందీ సినిమాలను ఈ ఓటీటీలో చూసేయండి.
వార్ (2019)
యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన యాక్షన్ మూవీ వార్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో జై జై శివ శంకర్ అనే పాటలో హోలీ సెలబ్రేషన్స్ చూపిస్తారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
యే జవానీ హై దీవానీ (2013)
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హాట్ బ్యూటి దీపికా పదుకొణె జోడీ కట్టిన సినిమా యే జవానీ హై దివానీ. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కింది. ఇందులో బాలం పిచ్కారీ అనే పాట చాలా పాపులర్ అయింది. ఈ పాటలో హోలీ సెలబ్రేషన్స్ జోరుగా చేసుకుంటారు. అందుకే ఈ సినిమాను హోలీ సెలబ్రేషన్స్ లిస్ట్‌లో చేరుస్తూ ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. యే జవానీ హై దీవానీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.
గోలియోన్ కి రాస్ లీలా రామ్ లీలా (2013)
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ మొదటిసారి నటించిన సినిమా గోలియోన్ కి రాస్ లీలా రామ్ లీలా. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హోలీ సెలబ్రేషన్స్‌లోనే పాత్రల లవ్ స్టోరీ మొదలు అవుతుంది. మూవీలో వచ్చే రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, జియో సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సిల్సిలా (1981)
హోలీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పాట రంగ్ బర్సే. ఈ పాట బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, రేఖ, సంజీవ్ కుమార్ నటించిన సిల్సిలా చిత్రంలోనిది. ఈ సినిమాలో గుర్తుండిపోయే హోలీ సీక్వెన్స్ సాంగ్ ఉంది. యష్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ మూవీలో రొమాన్స్, డ్రామాతోపాటు హోలీ సన్నివేశంపై ఎక్కువగా చూపించారు. ఇందులో పాత్రల మధ్య ప్రేమ, కోరిక, సంఘర్షణ వంటి భావోద్వేగాలను చూపిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
షోలే (1975)
ఈ హోలీని సెలబ్రేట్ చేసుకునేందుకు మరో పాపులర్ క్లాసిక్ చిత్రం 1975లో వచ్చిన రమేష్ సిప్పీ మూవీ షోలే. ఇందులో' హోలీ కే దిన్' అనే పాట హోలీ పండుగకే ఐకానిక్ సాంగ్‌గా నిలిచింది. ఈ పాటలో అమితాబ్ బచ్చన్ (జై), ధర్మేంద్ర (వీరు), హేమ మాలిని (బసంతి), రామ్‌గర్ గ్రామస్థులు పండుగను జరుపుకుంటూ డ్యాన్స్ చేస్తారు. ఇదే కాకుండా.. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ పాపులర్ డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మొహబ్బతేన్ (2000)
ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన మొరబ్బతేన్ సినిమా రంగుల పండుగ హోలీని జరుపుకోవడానికి తప్పనిసరిగా చూడవలసిన చిత్రం. హోలీ సందర్భంగా డ్యాన్స్ పార్టీలలో సోని సోని పాటను ఇప్పటికీ ప్లే చేస్తారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఉదయ్ చోప్రా, ఐశ్వర్యారాయ్ బచ్చన్, జిమ్మీ షెర్గిల్, జుగల్ హన్స్‌రాజ్, కిమ్ శర్మ, ప్రీతి జింగానియా నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.