OTT Movies This Month: ఈనెలలో ఓటీటీల్లోకి రానున్న టాప్-10 సినిమాలు.. డిఫరెంట్ జానర్లలో..
OTT Movies This Month: ఈనెలలో చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి అడుగుపెట్టనున్నాయి. కొన్ని సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. డిఫరెంట్ జానర్ల చిత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో ఓటీటీల్లోకి వచ్చే టాప్-10 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
ఓటీటీల్లో నయా సినిమాల కోసం చాలా మంది ప్రేక్షకులు వేచిచూస్తుంటారు. ఏ చిత్రాలు వస్తాయా అని క్యూరియాసిటీతో ఉంటారు. ఈనెల (సెప్టెంబర్)లోనూ చాలా సినిమాలు వివిధ ఓటీటీల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్, థియేటర్లలో బ్లాక్‍బస్టర్ సినిమాలు ఉన్నాయి. నేరుగా కూడా కొన్ని చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. మొత్తంగా ఈనెల ఓటీటీల్లోకి రానున్న టాప్-10 సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
కిల్
బాలీవుడ్ వైలెంట్ యాక్షన్ సినిమా ‘కిల్’ కమర్షియల్‍గా హిట్ అవటంతో ప్రశంసలు దక్కించుకుంది. రాఘవ్ జుయెల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది జూలై 5న రిలీజ్ అయింది. ఈ మూవీకి నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించారు. కిల్ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.
తలవన్
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలవన్’ సక్సెస్ అయింది. బిజూ మీనన్, ఆసిఫ్ అలీ, మియా జార్జ్ ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు. జియో జాయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మే 24 థియేటర్లలోకి వచ్చింది. తలవన్ చిత్రం సెప్టెంబర్ 10న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.
డబుల్ ఇస్మార్ట్
ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ సీక్వెల్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. డబుల్ ఇస్మార్ట్ మూవీ సెప్టెంబర్‌లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వస్తుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కమిటీ కుర్రోళ్ళు
తెలుగు కామెడీ డ్రామా మూవీ కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ అయింది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ లోబడ్జెట్ చిత్రం ఆగస్టు 9న రిలీజై సుమారు రూ.17కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కమిటీ కుర్రోళ్ళు సినిమా సెప్టెంబర్ తొలివారం లేకపోతే రెండో వారం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.
ఫాల్‍గాయ్
హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా ‘ఫాల్‍గాయ్’ మే నెలలో విడుదలైంది. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, ఇమిలీ బ్లంట్ లీడ్ రోల్స్ చేశారు. ఈ ఫాల్‍గాయ్ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుంది.
మిస్టర్ బచ్చన్
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదలైంది. ఈ తెలుగు యాక్షన్ డ్రామా మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. మిస్టర్ బచ్చన్ సినిమా సెప్టెంబర్‌లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం ఈనెల రెండో వారంలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఆయ్
తక్కువ బడ్జెట్ చిత్రంగా వచ్చి బ్లాక్‍బస్టర్ కొట్టింది ఆయ్ సినిమా. నార్నే నితిన్, నయన్ సారిక జోడీగా నటించిన ఈ మూవీకి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. రూ.15కోట్ల గ్రాస్ వసూళ్లకు పైగా సాధించింది. ఆయ్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్‌లోనే స్ట్రీమింగ్‍కు రానుంది.
సెక్టార్ 36
విక్రాంత్ మాసే హీరోగా నటించిన సెక్టార్ 36 సినిమా సెప్టెంబర్ 13వ తేదీన నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఆదిత్య నంబల్కర్ దర్శకత్వం వహించారు.
అడియోస్ అమిగో
మలయాళ కామెడీ డ్రామా సినిమా అడియోస్ అమిగో ఆగస్టు 9న థియేటర్లలోకి వచ్చింది. ఆసిఫ్ అలీ, సూరజ్ వెంజరమూడు లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి నాహస్ నజర్ డైరెక్షన్ చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 6వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.
బెర్లిన్
బెర్లిన్ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 13వ తేదీన నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ థ్రిల్లర్ చిత్రంలో అపర్‌శక్తి ఖురానా, రాహుల్ బోస్, ఇష్వాంక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు.