ఓటీటీల్లో ఈ వారం రానున్న టాప్-5 చిత్రాలు.. రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్-ott movies this week top 5 films streaming muthayya on etv win costao on zee5 ott bromance sony liv release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీల్లో ఈ వారం రానున్న టాప్-5 చిత్రాలు.. రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్

ఓటీటీల్లో ఈ వారం రానున్న టాప్-5 చిత్రాలు.. రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్

ఓటీటీ సినిమాలు: ఈవారం ఓటీటీల్లో రెండు సినిమాలు డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్నాయి. మరిన్ని చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. ఈవారం టాప్-5 రిలీజ్‍‌లు ఏవో ఇక్కడ చూడండి.

ఓటీటీ సినిమాలు: ఈ వారం స్ట్రీమింగ్‍కు రానున్న టాప్-5 చిత్రాలు.. రెండు డైరెక్ట్ ఎంట్రీ

వివిధ ఓటీటీల్లోకి ఈవారం మరిన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. అయితే, ఇందులో ఐదు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. వీటిలో రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈవారం (ఏప్రిల్ 28 - మే 3) ఓటీటీల్లోకి రానున్న వాటిలో 5 టాప్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

ముత్తయ్య

ముత్తయ్య సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానుంది. మే 1వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రంలో ‘బలగం’ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమై ప్రశంసలు దక్కించుకుంది. 70ఏళ్ల వయసులోనూ సినిమాలంటే పిచ్చి ఉండి, నటుడు కావాలనే ముత్తయ్య స్టోరీతో ఈ మూవీలో ఉంటుంది. ఈ సినిమాకు భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. ముత్తయ్య మూవీని మే 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.

బ్రొమాన్స్

మలయాళ అడ్వెంచర్ కామెడీ సినిమా బ్రొమాన్స్ నేడు (ఏప్రిల్ 30) సోనీలివ్ ఓటీటీలోకి రానుంది. నేటి సాయంత్రం 5.30 గంటలకు సోనీలివ్‍లో స్ట్రీమింగ్ మొదలవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమాలో మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ లీడ్ రోల్స్ చేయగా.. అరుణ్ జీ జోస్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన థియేటర్లలో విడుదలైన బ్రొమాన్స్ మంచి హిట్ కొట్టింది.

కాస్టవ్

నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషించిన హిందీ మూవీ కాస్టవ్.. మే 1వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. 1990ల్లో గోవాలో కస్టమ్స్ అధికారిగా పని చేసిన కాస్టవ్ ఫెర్నాండెజ్ నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా చిత్రం రూపొందింది. కాస్టవ్ చిత్రానికి సేజల్ షా దర్శకత్వం వహించారు.

జాక్

తెలుగు యాక్షన్ రొమాంటిక్ చిత్రం ‘జాక్’ ఈ వారంలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని సమాచారం. మే 2వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై నెట్‍‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజై డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‍గా నటించారు.

వరుణన్

తమిళ క్రైమ్ డ్రామా మూవీ వరుణన్ మే 1వ తేదీన ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. దుష్యంత్ జయప్రకాశ్ హీరోగా నటించిన ఈ మూవీకి జయవేల్ మురుగన్ దర్శకత్వం వహించారు. మార్చి 14న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మే 1 నుంచి ఆహా తమిళ్‍లో వరుణన్ చిత్రాన్ని చూడొచ్చు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం