OTT Movies: ఈ వారం ఓటీటీలోకి 35 సినిమాలు- ఒక్కదాంట్లోనే 20 స్ట్రీమింగ్- హారర్‌తోపాటు అన్ని జోనర్స్- ఎక్కడ చూడాలంటే?
OTT Release This Week Telugu: ఓటీటీల్లోకి ఈ వారం 35 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే 20 రిలీజ్ కాగా అన్నింట్లో చూసేందుకు 9 మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో 3 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా అందులో హారర్, మైథలాజికల్, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి.
OTT Telugu Movies This Week: ఓటీటీలోకి ఈ వారం (డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 15) 35 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో ఒక్క ఓటీటీలోనే 20 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో హారర్, యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్, మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
హరికథ (తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
ఎల్టన్ జాన్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 13
ఇన్విజబుల్ (స్పానిష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ
సీక్రెట్ లెవల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
సింగం ఎగైన్ (హిందీ మూవీ)- డిసెంబర్ 12
బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 9
ది షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 9
తంగలాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- డిసెంబర్ 10
జెమియా ఫాక్స్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 10
పోలో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
రగ్డ్ రగ్బీ (కొరియన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
మకల్యాస్ వాయిస్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 11
మారియా (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 11
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
క్వీర్: ఐ సీజన్ 9 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
ది ఆడిటర్స్ (కొరియన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
ది కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ మూవీ)- డిసెంబర్ 12
లా పల్మా (నార్వేజియన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
1992 (స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 12
క్యారీ ఆన్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 13
డిజాస్టర్ హాలీడే (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 13
మిస్ మ్యాచ్‌డ్ సీజన్ 3 (హిందీ రొమాంటిక్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
టాలెంట్ లెస్ టకానో (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 14
జియో సినిమా ఓటీటీ
బూకీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
పారిస్ అండ్ నికోల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
బుక్ మై షో ఓటీటీ
డ్యాన్సింగ్ విలేజ్: ది కర్స్ బిగిన్స్ (ఇండోనేషియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 10
ది క్రో (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 10
బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 13
డిస్పాచ్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జీ5 ఓటీటీ- డిసెంబర్ 13
షో ట్రైల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
వండర్ పెట్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- డిసెంబర్ 13
35 స్పెషల్
ఇలా ఈ వారం 35 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏకంగా 20 రిలీజ్ కావడం విశేషం. వాటిలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ చాలా స్పెషల్‌గా ఉంది. అలాగే, తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ బొగెన్ విల్లా, హిందీ క్రైమ్ థ్రిల్లర్ డిస్పాచ్, ఇండోనేషియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్యాన్సింగ్ విలేజ్, తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హరికథ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
తెలుగులో 3 స్ట్రీమింగ్
ఇంకా హిందీ రొమాంటిక్ వెబ్ సిరీస్ మిస్ మ్యాచ్‌డ్ సీజన్ 3, బండిష్ బండిట్స్ సీజన్ 2, థ్రిల్లర్ మూవీ 1992, భారీ హిందీ మల్టీ స్టారర్ సినిమా సింగం ఎగైన్ కూడా స్పెషల్‌గా ఉన్నాయి. అంటే, ఆరు సినిమాలు, మూడు వెబ్ సిరీస్‌లతో 9 మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక వీటన్నింటిలో మూడు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.