OTT Movies: ఓటీటీలో 14 సినిమాలు- 7 చాలా స్పెషల్- ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో- ఇక్కడ చూసేయండి!-ott movies this week telugu like razakar wife off the smile man streaming on aha etv win netflix amazon ott releases ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో 14 సినిమాలు- 7 చాలా స్పెషల్- ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో- ఇక్కడ చూసేయండి!

OTT Movies: ఓటీటీలో 14 సినిమాలు- 7 చాలా స్పెషల్- ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Jan 20, 2025 02:26 PM IST

OTT Releases This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 14 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 7 స్పెషల్‌గా చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. మూడు మాత్రం తెలుగులో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో 14 సినిమాలు- 7 చాలా స్పెషల్- ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో 14 సినిమాలు- 7 చాలా స్పెషల్- ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో- ఇక్కడ చూసేయండి!

OTT Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం సుమారుగా 14 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్, రొమాంటిక్ కామెడీ, సర్వైవల్ థ్రిల్లర్ వంటి జోనర్స్ ఉన్నాయి. ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, ఆహా ఓటీటీతోపాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది నైట్ ఏజెంట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) -జనవరి 23

షాఫ్టెడ్ (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్)- జనవరి 24

ది సాండ్ కాస్టెల్ (లెబనీస్ సర్వైవల్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 24

ది ట్రామా కోడ్ హీరోస్ ఆన్ కాల్ (కొరియన్ మెడికల్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్) -జనవరి 24

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

అలంగు (ఇండియన్ ఫీల్ గుడ్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 19

హార్లెమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 23

ఆహా ఓటీటీ

రజాకార్ (తెలుగు పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 24

ది స్మైల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 24

ప్రైమ్ టార్గెట్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జనవరి 22

వైఫ్ ఆఫ్ (తెలుగు ఫ్యామీలీ డ్రామా సినిమా)- జనవరి 23- ఈటీవీ విన్ ఓటీటీ

హిసాబ్ బరాబర్ (హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జనవరి 24

స్వీట్ డ్రీమ్స్ (అమెరికన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 24

ది గర్ల్ విత్ ది నీడిల్ (డానిష్ క్రైమ్ డ్రామా సినిమా)- ముబి ఓటీటీ- జనవరి 24

దీది (అమెరికన్ కామెడీ డ్రామా మూవీ)- జియో సినిమా ఓటీటీ- జనవరి 26

ఓటీటీలో 14- తెలుగులో 3

ఇలా ఈ వారం అంటే జనవరి 20 నుంచి 26 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 14 వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అనసూయ రజాకార్, ఫ్యామిలీ డ్రామా వైఫ్ ఆఫ్ స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, తెలుగు డబ్బింగ్ కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది స్మైల్ మ్యాన్ ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. ఈ మూడు తెలుగులో అందుబాటులో ఉండున్నాయి.

ఏడు స్పెషల్ సినిమాలు

వీటితోపాటు మాధవన్ థ్రిల్లర్ డ్రామా హిందీ వెబ్ సిరీస్ హిసాబ్ బరాబర్, క్రైమ్ చిత్రం ది గర్ల్ విత్ ది నీడిల్, ఫ్యామిలీ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ది సాండ్ కాస్టెల్, థ్రిల్లర్ సినిమా అల్లంగు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా మొత్తంగా ఆరు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో మొత్తంగా ఏడు స్పెషల్‌గా ఓటీటీలోకి రానున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం