OTT Movies: ఓటీటీలో 36 సినిమాలు.. తెలుగులో 18.. స్పెషల్‌గా 11 మాత్రమే.. ఇక్కడ చూసేయండి!-ott movies this week telugu kobali vivekanandan viral rekhachithram anuja ott streaming on netflix amazon prime aha zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో 36 సినిమాలు.. తెలుగులో 18.. స్పెషల్‌గా 11 మాత్రమే.. ఇక్కడ చూసేయండి!

OTT Movies: ఓటీటీలో 36 సినిమాలు.. తెలుగులో 18.. స్పెషల్‌గా 11 మాత్రమే.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 36 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగులో 18 అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్నింటిలో మొత్తంగా చూసేందుకు స్పెషల్‌గా 11 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవన్నీ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా జోనర్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

ఓటీటీలో 36 సినిమాలు.. తెలుగులో 18.. స్పెషల్‌గా 11 మాత్రమే.. ఇక్కడ చూసేయండి!

OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం (ఫిబ్రవరి 3 నుంచి 9) 36 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అవన్నీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, కామెడీ, రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్, డాక్యుమెంటరీ, ఫ్యామిలీ డ్రామా వంటి జోనర్స్‌ గల సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, ఈటీవీ విన్, ఆహాలో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బొగోటా: సిటీ ఆఫ్ ది లైఫ్స్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 3

కైండ ప్రెగ్నెంట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 4

అనూజ (అమెరికన్ హిందీ షార్ట్ ఫిల్మ్) - ఫిబ్రవరి 5

ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్ సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 5

సెలబ్రిటీ బేర్ హంట్ (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటిషన్ షో)- ఫిబ్రవరి 5

ఆపిల్ సైడర్ వెనిగర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 6

ది ఆర్ మర్డర్స్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

కసాండ్రా (జెర్మనీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 7

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఇన్విసిబుల్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

ది మెహాతా బాయ్స్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7

న్యూటోపియా (సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7

సోనీ లివ్ ఓటీటీ

రేఖా చిత్రం (మలయాళ మిస్ట్రరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 5

బడా నామ్ కరేంగే (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7

మనోరమ మ్యాక్స్ ఓటీటీ

స్వర్గం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7

వాలియెట్టన్ 4కె (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 7

కోబలి (తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 4

లవ్ యు టు డెత్ (స్పానిష్ రొమాంటిక్ చిత్రం)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- ఫిబ్రవరి 5

వివేకానందన్ వైరల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా సినిమా) ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 7

మిసెస్ (హిందీ ఫ్యామిలీ డ్రామా సినిమా) -జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 7

ఈటీవీ విన్ ఓటీటీ సినిమాలు

వీటితోపాటు ఒక్క ఈటీవీ విన్ ఓటీటీలోనే ఫిబ్రవరి 6న 16 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవి ఇది వరకు పలు రిలీజ్ అయిన అలా మొదలైంది, అతడు, బేవర్స్, బిచ్చగాడ మజాకా, బ్లఫ్ మాస్టర్ట్, బాడీ గార్డ్, క్రేజీ ఫెలో, ఫిదా, ఖాకీ, మోసగాళ్లకు మోసగాడు, ఊరు పేరు భైరవకోన, పాండురంగడు, సింహా, తరువాత ఎవరు, టాప్ గేర్, వాన సినిమాలు. వీటిని 4కే, డీబీ ప్లస్ ఆడియో క్వాలిటీతో తెలుగులో ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.

మొత్తం 36- స్పెషల్‌గా 11

ఇలా ఈ వారం ఓటీటీలోకి 36 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోబలి, అనూజ మూవీ, ప్రిజన్ సెల్ 211 వెబ్ సిరీస్, ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ది మెహాతా బాయ్స్, న్యూటోపియా, రేఖా చిత్రం, బడా నామ్ కరేంగే, స్వర్గం, వివేకానందన్ వైరల్, మిసెస్ వంటివి 11 స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో రెండే తెలుగులో ఉన్నాయి. ఇక ఈటీవీ విన్ సినిమాలతో చూస్తే మొత్తంగా 18 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు.

సంబంధిత కథనం